యాదాద్రి భువనగిరి జిల్లా మే.16,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ యాదగిరిగుట్ట:-ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన అభిలాష్ దర్శనం కోసం వెళ్లే క్రమంలో కారు విండో గ్లాస్ తెరిచి వెళ్లిపోయాడు.కారులో అభిలాష్ ఐడి కార్డులు,4 ఫోన్లు,పర్సు ఉన్నాయి.అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యుగేంధర్,హోంగార్డు రవి విషయాన్ని గమనించి సమాచార కేంద్రంలో అనౌన్స్మెంట్ ద్వారా అభిలాష్ ను పిలిచి వారి విలువైన వస్తువులను అప్పజెప్పారు.





