పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సాయి గుడిలో ప్రత్యేక పూజలు

Spread the love

చింతపల్లి. మే 16 జన సముద్రం న్యూస్

నల్గొండ,వరంగల్, ఖమ్మం, జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల ఎమ్మెల్సీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా దేవరకొండ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పట్టభద్రుల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వెళ్తున్న సందర్భంగా చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా మందిరంలో దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచి కంటి ధనంజయ వారిని సాదరంగా ఆహ్వానించి తీన్మార్ మల్లన్నకు ఆలయ పూజారులతో బాబా ప్రత్యేక ఆశీర్వాచనాలు అందజేశా రు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న నూ వారి వెంట విచ్చేసిన బృందాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులను యువకులను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చు కొని ముందుకు వెళ్లాలని వారు సూచించారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి దేవాలయం తరఫున ఆలయ కమిటీ నిర్వాహకులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లి మండలంలో ఇలాంటి ప్రశాంతమైన దేవాలయం నల్లగొండ జిల్లాలోని ఈ ప్రాంతంలో నెలకొల్పడం మన అందరి అదృష్టమన్నారు. షిరిడి తర్వాత ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మాణం చేపట్టిన ఆలయ కమిటీ చైర్మన్ మంచి కమిటీ ధనంజయకు కమిటీ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా పశువుల గోశాలను కూడా ఎంతో అద్భుతంగా ఏర్పాటుచేసి నిర్వహణ చేపట్టడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం అన్నారు. తాను శిరిడి సాయిబాబా దైవ కృపతో మీ ముందుకు వచ్చి చట్ట సభల్లో ప్రశ్నించేందుకు ఈనెల 27న జరిగే నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తనకు ఈ అవకాశాన్ని కల్పించిందన్నారు. అందుకోసం ప్రతి ఒక్క పట్టభద్రులైన యువతీ యువకులు మీ అమూల్యమైన ఓటును తనకుకు వేసి చట్టసభకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం ,నాయకులు ముచ్చర్ల యాదగిరి, పి ఎస్ ఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, కాసారం శ్రీనివాస్, గోవింద్ యాదగిరి , రవి, సదానందం, ఆలయ కమిటీ సభ్యులు కోశాధికారి ఊరే కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి వెంకటయ్య, కుంభం పుల్లారెడ్డి, తడకమళ్ళ శ్రీనివాస్, ఆలయ పూజారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి