జనసముద్రం న్యూస్ మే16:డిండి:-
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం డిండి ప్రాజెక్టులోని నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.దీంతో వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి గోరేటి జంగయ్యకు సమాచారం అందజేశారు.కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక జాలర్ల సహాయంతో మృతదేహాన్ని నీటి నుండి బయటకు తీశారు. మృతురాలి వయస్సు దాదాపుగా 50 సంవత్సరాల వరకు ఉంటుందని,మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉందని,5.4 ఎత్తు ఉందన్నారు.మృతురాలి చీర ఎరుపు రంగు,జాకెట్టు ఆకుపచ్చ రంగులో ఉందని తెలిపారు.ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు లేవని, ఆమె రెండు చేతులకు బంగారు వర్ణం గల నాలుగు గాజులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతురాలిని గుర్తించిన వారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 8712670155,డిండి ఎస్ఐ 8712670223 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.






