జన సముద్రం న్యూస్ హుజురాబాద్ మే 16: గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడును జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తొమ్మిది సమ్మిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సొల్లు బాబు జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మొలుగురి సదయ్య అలాగే తిరుపతి, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.





