కేటీఆర్‌ లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమేనా?

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్: 18

గత కొద్ది రోజులుగా తెలంగాణా రాజకీయాలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు, సినిమా తారలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన ఫోన్‌ ను కూడా ట్యాప్‌ చేశారని తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సై ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులు అరెస్టు కూడా అయ్యారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ లదే ప్రధాన పాత్ర అని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ దోషులుగా తేలితే జైలుకు పంపుతామని ఇప్పటికే రేవంత్‌ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రధానంగా రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేశారని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసింది.

మరోవైపు తనకు ఏ పాపం తెలియదని కేటీఆర్‌ చెబుతున్నారు. ఎవరో ఒకరిద్దరి ఫోన్లను ట్యాప్‌ చేశారేమో తనకు తెలియదంటున్నారు. ఇక హరీశ్‌ రావు మరో అడుగు ముందుకేసి కేటీఆర్‌ లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మరి రేవంత్‌ కూడా లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని హరీశ్‌ రావు మండిపడుతున్నారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై కేటీఆర్‌ లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తును పర్యవేక్షిస్తారన్న నమ్మకం ఉంటే రేవంత్‌ కూడా ఇదే పరీక్షకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

అయితే ఇప్పటికే అరెస్టు అయిన పోలీసు అధికారులు ప్రణీత్‌ రావు, రాధాకిషన్‌ తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్టు అంగీకరించినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వంలోని ఒక పెద్ద నేత, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి చెబితేనే తాము ట్యాపింగ్‌ కు పాల్పడ్డట్టు వెల్లడించారని వార్తలు వచ్చాయి. ఇంత జరుగుతున్నా హరీశ్‌ రావు మాత్రం సవాళ్లు విసురుతుండటంపై సెటైర్లు పడుతున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కు సంబంధించిన ఆధారాలను మూసీ నది వద్దకు తీసుకెళ్లి హార్డ్‌ డిస్కులను, కంప్యూటర్లను నాశనం చేశారని తేలింది. ఇన్ని ఆధారాలు బయటపడుతున్నా హరీశ్‌ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్