ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి “అరవ శ్రీధర్”…
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ మే 16 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు పట్టణమునందు16/5/2024 తేదీ గురువారం రోజున బల్జిపల్లి గంగమ్మ జాతర మొదల అయినది, ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగినది. అంతేగాక ఆ మహాతల్లిని దర్శించుకొనుటకు కుల మత భేదం లేకుండా ముస్లిమ్స్, క్రైస్తవులు, కూడా వేల సంఖ్యలో వచ్చి అమ్మవారికి..! చీరను, నైవేద్యంగా ఇచ్చి దర్శించుకోవడం జరుగుతున్నది… ఆ మహాతల్లి అయినటువంటి అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు.. ఆ మహాతల్లి రూపం మహా అద్భుతం… సర్వలోక జనని, ఆ మహా శివుడే మెచ్చిన రూపం, గంగమ్మ తల్లి రూపం, ఈ మహా తల్లిని దర్శించు కొనుటకు రైల్వేకోడూరులోని పలు రాజకీయ నాయకులు కూడా రావడం జరిగినది, ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన ఎమ్మెల్యే కాండేట్ అరవ శ్రీధర్, తెలుగుదేశం ఇంచార్జ్ ముక్క రూపానంద రెడ్డి వారు, సతీమణి అన్నపూర్ణాదేవి వరలక్ష్మి వారు, “డేర్ అండ్ డైనమిక్ రెబల్” తెలుగు దేశం యువ నాయకుడు ముక్క సాయి వికాస్ రెడ్డి, అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది.. అంతేగాక రైల్వే కోడూర్ రాజకీయ అష్టదిగ్గజేయుడు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు వారు అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది, రైల్వే కోడూర్ బలిజిపల్లి గంగమ్మ తల్లి ధర్మకర్తలు మాట్లాడుతూ… ప్రతి ఒక్క కుటుంబానికి, అమ్మవారి భక్తులకు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్క కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉంటారని ఉండాలని ఆ మహాతల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించడం జరుగుతున్నది, అని చెప్పుకొచ్చారు





