జనసముద్రంన్యూస్, మే 16, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, విజయపురి సౌత్.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలనీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.నాగార్జున సాగర్ లో అంతర్భాగమైన విజయపురిసౌత్,సాగర్ క్యాంపు,లంకమోటు ప్రాంతాల్లో గత కొంతకాలంగా అరకొరగానే నీటి సరఫరా చేస్తుండటంతో ప్రాజెక్టు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు రాజకీయ నాయకులు పోటీ పడి నీటి ట్యాంకర్ లను పంపించి దాహార్తిని తీర్చడం జరిగింది.అయితే ఎన్నికలు ముగియగానే తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులను పట్టించుకునే వారే కరువయ్యారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





