రైల్వే ఆస్తులు జోలికి వెళ్తే బెయిల్ కూడా పుట్టదని భయపడతారు”..
కడప జిల్లా మామిళ్ళపల్లి గ్రామం “సర్వేనెంబర్40,41,42లొ” రైల్వే డిపార్ట్మెంట్ కు సంబంధం లేని వ్యక్తులకు అధికార పార్టీ నాయకులు రిజిస్ట్రేషన్ చేయుంచడం..
కడప జిల్లాలో రిజిస్ట్రేషన్ మాఫియాకు.. వ్యతిరేకంగా ఏప్రిల్ 3న నిరసన….
. అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్:- మార్చ్ 30 జనసముద్రం న్యూస్
భూమాఫియా కేరాఫ్ అడ్రస్ గా మారిన గత కడప తహసిల్దార్ “శివరామిరెడ్డి “చింతకొమ్మదిన్నె తహసిల్దార్ “మహేశ్వర్ రెడ్డి” లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం…
గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ “కారు ఆంజనేయులు”…
అధికార పార్టీ ముసుగులో జిల్లాలో రైల్వే భూములో రెవెన్యూ భూములు వంకలు వాగుల భూములను భూ మాఫియా తో రిజిస్ట్రేషన్ మాఫియా రెవెన్యూ మాఫియా కలిసి భూ దోపిడీకి పాల్పడుతున్నారని జిల్లాలో అన్యాక్రాంతాన్ని గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ “కారు ఆంజనేయులు” డిమాండ్ చేశారు…
జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలను ప్రజా సంఘాల నేతలను కలిసి భూ మాఫియా కి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడుదామని నేతలకు వివరిస్తున్న గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక నేతలు కారు ఆంజనేయులు, బందెల ఓబయ్య, షాజహాన్ తదితర నేతలు
ఏప్రిల్ 3 తేదీన కో-ఆపరేటివ్ కాలనీలోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మరియు సూపర్డెంట్ ఆఫ్ స్టాంపుల కార్యాలయం ఎదుట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టామని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు

ఈ సందర్భంగా కారు ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వానికి సంబందించిన రైల్వే ఆస్తులను దొంగతనం చేయాలంటే అంత సులభంగా బైయిలు కూడా పుట్టదని భయపడతారు. కానీ కడపలో భూ మాఫియా, రిజిస్ట్రేషన్ మాఫియా ఇద్దరు ఒకటై రైల్వే ఆస్తులను కొల్లగొట్టారు. 1982వ సం॥లో రైల్వే కో ఆపరేటీవ్ సొసైటీ ద్వారా 496 మందికి రైల్వే ఉద్యోగస్తులకు కడప జిల్లా, కడప సిటీ, మామిళ్ళపల్లె గ్రామ పొలములోని సర్వే నెంబరు 40, 41, 42లో ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఈ స్థలాలను భూ మాఫియా, రిజిస్ట్రేషన్ మాఫియా ఇద్దరు కుమ్మక్కై 200 ప్లాట్లకు పైబడి ప్లాట్ల యజమానులకు గానీ, రైల్వే డిపార్టుమెంటుకు సంబందం లేనటువంటి వారికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వెంచర్లో ప్లాట్లకు 2006వ సం|| నుండి ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు ఈ వెంచరులో ఉన్న ప్లాట్లకు పన్ను వేయ్యలేదు. క్రొత్తగా వచ్చినటువంటి ఐ.ఎ.యస్. కమీషనర్ జోక్యం చేసుకొని పన్ను వేస్తారు అని అనుకుంటే సార్ కూడా వేయ్యలేకపోయారు. అంటే అధికార పార్టీ కబ్జా దారులకు ఎంత అండదండలు వున్నవో అర్ధమౌతుంది.
ఈ భూమి దాదాపుగా 20 కోట్ల రూపాయల ఈ ఇరువురికి చెందినదని అర్ధమౌతుంది. అలాగే రైల్వే భూములు కడప నగరములో కానీ మామిళ్ళపల్లె, క్రిష్ణాపురం రెవిన్యూ గ్రామాలల్లో దాదాపు 500 యకరముల దాక రైల్వే భూములు ఉన్నవి. ఈ భూములను రిజిస్ట్రేషన్ మాఫియా సహాకారముతో అధికార పార్టీ అండదండలతో కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జా చేసిన భూములలో వెంచర్లు వేసి ప్లాట్లను అమ్ముతున్నారు. రైల్వే అధికారులు ఏమి పట్టనట్లుగా ఉంటున్నారు. సర్వే నెంబరు 39లో య. 13.72 సెంట్లు, సర్వే నెంబరు 60లో య.
4.19 సెంట్లు. సర్వే నెంబరు 61లో య. 2.17 సెంట్లు, సర్వే నెంబరు 62లో య. 6.10 సెంట్లు, సర్వే నెంబరు 63లో య. 0.40 సెంట్లు సర్వే నెంబర్లు 61/1, 64/2, 64/3, 64/5, 60/1, 60/2, 60/3, 60/4, 60/5, 39/1, 39/2, 39/3, 39/4, కృష్ణాపురం రెవిన్యూ గ్రామంలో సర్వేర్ నెంబర్లు 9/5, 18, 19, 20, 21, 22/2లలో య. 11.70 సెంట్లు యకరాలను కబ్జా చేశారు. ఈ భూములు నిశేధిత రైల్వే భూములు. వీటిని రిజిష్టరు చేయడానికి రిజిస్ట్రేషన్ అధికారులకు హక్కు లేదు. కానీ ఈ భూములలో అమ్మితే వచ్చిన లాభములో వాటాలు రిజిష్ట్రురు అధికారులకు, భూ మాఫియాకు ఉ న్నట్లుగా చర్చ జరుగుతున్నది. రైల్వే భూములు అన్నింటిని సర్వే నిర్వహించి భవిష్యత్తు అవసరాల కోసం భూముల చుట్టూరు పెన్సింగ్ వేసి భూములను రక్షించాలని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేధిక విజ్ఞప్తి చేస్తున్నది. ఈ భూములు కబ్జా చేసినటువంటి వారి పైన సహాకరించిన అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
రిజిస్ట్రేషన్ అధికారులు అయిన శ్రీ రామకృష్ణ డి.ఐ.జి., విజయవాడ, శ్రీ పి.వి.యన్. బాబు కడప రిజిష్టరు. శ్రీ బి. శివరామ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్, శ్రీ సుందరేషన్ కడప రూరల్, డిప్యూటేషన్ సబ్ రిజిస్ట్రారు, శ్రీమతి శ్యామలా దేవి (సస్పెండెండ్) కడప రూరల్ సబ్ రిజిష్ట్రారు వీరు, భూ మాఫియాకు సహాకరించారు ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఏప్రిల్ 3 తేదీన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మరియు సూపర్డెంట్ ఆఫ్ స్టాంపుల కార్యాలయం ఎదుట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టామని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు





