రాప్తాడు మండలం చిన్మయ నగర్ లో ప్రచారం చేసిన తోపుదుర్తి శైలజా రెడ్డి..!
జనసముద్రం న్యూస్, రాప్తాడు మండలం ఏప్రిల్ 15:
సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోపుదుర్తి కుటుంబ సభ్యురాలు తోపుదుర్తి శైలజ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాప్తాడు మండలం చిన్మయనగర్ లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిలోనూ తమ ఆడబిడ్డలా తోపుదుర్తి శైలజా రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గం పూర్తి ప్రశాంతంగా ఉందన్నారు.

ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గంగుల భానుమతి , ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మంజుల , మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు.





