జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి భాయి ఇందిరా కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ చేశారు

Spread the love

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్, మార్చి.30

బి.ఎం.హెచ్.ఓ మాట్లాడుతూ, వడదెబ్బ లక్షణాలు ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం,శరీరంలో నీటిని కోల్పోవడం,పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరగవచ్చని,తీవ్రమైన వడగాల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, పొలం పనులు వెళ్లేవారు ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపే వెళ్లి రావాలని,తప్పకుండా అందరూ, రుమాల్ గాని, టోపిని, గొడుగు గాని వెంట తీసుకెళ్లాలని, తెల్లని నూలు వస్త్రాలు ధరించాలని ధరించాలని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదని, నీరు మరి ఇతర ద్రవపదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బకు గురి అయిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశాన్ని తీసుకెళ్లాలని శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలని వడదెబ్బ తగిలిన వారికి ఉప్పు, మజ్జిగ, కొబ్బరినీళ్ల, గ్లూకోజ్ మరియు ఇతర లవణాలు ఓఆర్ఎస్ కలిపిన నీటిని త్రాగించాలని ప్రధమ చికిత్స చేసి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరడం జరిగింది. అత్యవసర సేవలకై 108 వాహనాన్ని ఉపయోగించుకోవాలని, వైద్య సిబ్బంది ప్రజలందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.
డిప్యూటీ డిఎంహెచ్వో లు,ప్రోగ్రాం ఆఫీసర్స్, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ తో ఆఫీసర్ తో హీట్ వేవ్ గురించి గురించి జూమ్ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎమ్ హెచ్ ఓ,డాక్టర్ అంబరీష్, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్, కె. వి రాజు ,పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి