ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.

Spread the love

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30

ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం అని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యల జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తో కలిసి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అధిక ఉష్నోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అందులో భాగంగా మునిసిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్ని మునిసిపాలిటీలల్లో స్వచ్చంద సేవా సంస్థల సహకారంతో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఏ.ఎన్.ఎం.లతో సమన్వయం చేసుకుని వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించేలా, అలాగే తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వేసవిలో విద్యుత్ అవసరం అధికంగా ఉంటుంది కావున అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని గ్రామీణాభివ్రుద్ది అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే పని వేళల్లో మార్పులు పరిశీలించాలన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆయా అంగన్వాడీ వేసవి వడగాల్పుల పై సిడిపిఓ, సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణీల సౌలభ్యం కోసం ముందస్తుగా ఓ.ఆర్.ఎస్., సంబందిత ద్రావకాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి ఎలాంటి కొరత లేకుండా ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వడగాల్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అటవీ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా.. అక్కడక్కడా నీటి తొట్టెలు ఏర్పటు చేసి నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆటవీశాఖాధికారులను ఆదేశించారు. ప్రత్యేక జాగ్రత్తలతో పశువుల పెంపకాలను చేపట్టేందుకు పశువుల కాపర్లకు తగిన సూచనలను కరపత్రాల రూపంలో గ్రామాల్లో అవగాహన చేపట్టాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రమాదాల నివారణకు అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని.. పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా మున్సిపల్ కమీషనర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వడదెబ్బ, అతిసారం లాంటి సమస్యలపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు వెంటనే స్పందిస్తూ తక్షణ సేవాలందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీ.ఈ.ఓ రమాదేవి, మహబూబాబాద్,తొర్రూరు ఆర్దేఒ లు అలివేలు, నరసింగరావు, సి.పి.ఓ సుబ్బారావు, డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, డి.పి.ఓ హరిప్రసాద్, అడిషనల్ డి.ఆర్.డి.ఓ శాంతకుమారి, డి.పి.ఓ అభిమన్యుడు, విద్యుత్ అధికారి నరేష్, ఆర్.అండ్.బి.ఈఈ తానేశ్వర్ మహబూబాబాద్,గూడూరు అటవీ డివిజనల్ అధికారులు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి