హాజరుకానున్న లావు, జూలకంటి
జనసముద్రంన్యూస్, మార్చి 30, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల.
నేడు అనగా 31.3.24 ఆదివారం పట్టణంలోని నరిశెట్టి కళ్యాణ మండపం లో వడియ రాజుల ఆత్మీయ సమావేశం జరుగుతుందని మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు మరియు మాచర్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి యంఎల్ఏ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు.కావున నియోజకవర్గం లోని వడ్డెర కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ వడ్డెర సాధికార సమితి సభ్యులు పాల్గొన్నారు.





