జనసముద్రం న్యూస్ గుడివాడ ప్రతినిధి.మార్చ్.29.
*-గుడ్ ఫ్రైడే శాంతి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని
కల్వరి సన్నిధి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకుల నుండి ఎమ్మెల్యే నాని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.”ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు” అని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు.

మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు” అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. క్రీస్తు దేవుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. శాంతి ర్యాలీలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, సీనియర్ నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, తోటా శివాజీ, చుండూరి శేఖర్ పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.





