జన సముద్రం న్యూస్ పోలవరం ప్రతినిధి 30-3 2024
ఏలూరు జిల్లా
కోయ్యాలగూడెం మండలం పరింపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు పర్యటించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తమ గ్రామంలో స్మశానవాటిక లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వివరించడం జరిగింది. దీనికిగాను ఉమ్మడి పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు వారికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు కమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు కుమార్ పాల్గొన్నారు.





