
పలువురికి తీవ్రగాయాలయ్యాయి
సమాచారం ఇచ్చిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు
జన సముద్రం దేవరకొండ ప్రతినిధి మార్చి:28
దేవరకొండ పట్టణం లో విధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయింది.అవి ఎప్పుడు ,ఎలా దాడి చేస్తాయో అని ప్రజలు భయ భ్రాంతులు అవుతున్నారు.మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు పట్టించు కోవడం లేదు
వాసవి బజార్లో బుధవారం సాయంత్రం వీధి కుక్క పలువురిని గాయపరిచింది. కర్నాటి పద్మ, జల్లా హరీశ్, శీల శ్వేత, పద్మావతి, పవన్‌తో పాటు నలుగురు చిన్నారులను కుక్క కరిచిందని బాధితులు తెలిపారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీల రవికుమార్ తెలిపారు.





