
జన సముద్రం న్యూస్ నాంపల్లి మార్చి 28
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చండూరు, నాంపల్లి మండల కేంద్రాల్లోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలలో మంగళవారం ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం 2024 (శాంతి కోసం నీరు) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నీటి ప్రాముఖ్యత విలువల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1992లో మొదటిసారిగా నీటి దినోత్సవం ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం భిన్నమైన దీంతో నిర్వహించుకోవడం మానవైతగా మారిందని అన్నారు. ఈ సంవత్సరం థీమ్ – “శాంతి కోసం నీరు”అని తెలిపారు. నీటిని ఆధా చేయడం అందరి బాధ్యత !మన దైనందిన జీవితంలో చేసే పనులు పళ్ళు తోముకోవడం, స్థానం చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి విషయాల్లో తగినంత మీరు వినియోగించుకోవాలన్నారు. నీటిని వృధా చేయకుండా కొత్తగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల లాంటి కారణాల వల్ల భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అలా నీటి సమస్య రాకుండా ఉండాలంటే మనమంతా ఐక్యం కావాలన్నారు. విద్యార్థులచే జల ప్రతిజ్ఞ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పాఠశాల డైరెక్టర్ కర్నాటి నాగరాజ్, ప్రిన్సిపాల్ చుక్క రామయ్య, బందనాథం సురేష్, మూర్తి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు





