దర్శి నియోజకవర్గ నాయకులతో యువనేత లోకేష్ భేటీ

Spread the love

ఇన్ ఛార్జి లేకపోయినా దర్శిలో యువగళం సూపర్ హిట్
దర్శి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు అభినందనలు
త్వరలో బలమైన అభ్యర్ధి…మంచి మెజార్టీతో గెలిపించండి
దర్శి నియోజకవర్గ నాయకులతో యువనేత లోకేష్ భేటీ

దర్శి,ఆగస్టు 03 జనసముద్రం న్యూస్:

ఇంఛార్జ్ లేకపోయినా దర్శిలో నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో యువగళం పాదయాత్రను సూపర్ హిట్ చేశారని యువనేత నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. వినుకొండ నియోజకవర్గం పుచ్చనూతలలో దర్శి నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జుల లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. లోకేష్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిలో పట్టుదల ఉంది. దర్శిలో మనం గెలవబోతున్నాం… మంచి మెజారిటీ సాధించాలి. నిత్యం ప్రజల్లో ఉండే బలమైన అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం.

ఎన్నికల తర్వాత ఇన్చార్జి వ్యవస్థ ఉండదు!

2024 ఎన్నికల తర్వాత ఇంఛార్జ్ ల వ్యవస్థ ఉండదు. మండల, గ్రామ కమిటీలను బలోపేతం చేస్తాం. మండలాలు, క్లస్టర్లలో బాధ్యులు పార్టీని పటిష్టం చేయాలి. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయండి. భవిష్యత్తకు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. వర్గ విభేధాలుంటే పక్కన పెట్టాల్సిందే. పంచాయతీ ఎన్నికల్లో బాగా ఇబ్బంది పడ్డారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంద పెట్టింది. తప్పుడు కేసులతో మిమ్మల్ని వేధించింది. సీఎం సామాజికవర్గంలోనూ జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. దొంగ ఓట్లపై దృష్టి పెట్టండి. మీరు అప్రమత్తంగా ఉంటే ప్రజల ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్చడం కుదరదు. పార్టీ తరపున చేయాల్సిన కార్యక్రమాలపై ఇక గట్టి ఫోకస్ పెట్టాలని లోకేష్ కోరారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్