ప్రజా శ్రేయస్సు కోసం పిజెఆర్ ట్రస్ట్

Spread the love
  • ట్రస్ట్ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించిన పిజెఆర్ ట్రస్ట్ సభ్యులు…
  • విద్య వైద్యం యువతకు , మహిళలకు చేయూత, ఆలయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పిజెఆర్ ట్రస్ట్……రౌడీల పాలన పోవాలి…. ప్రజా రక్షణ పాలన రావాలి….
  • బంగారు భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలి….. .పెరుమాళ్ళ జీవానంద రెడ్డి

గుంతకల్లు ఆగస్టు 02 జనసముద్రం న్యూస్;

ప్రజా శ్రేయస్సు కోసం పిజెఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు పేర్కొన్నారు. గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం గజరాంపల్లి గ్రామం వ్యాలీ గ్రీన్ గార్మెంట్ నందు పీజేఆర్ ట్రస్ట్ వార్షికోత్సవాలు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి న జీవానంద రెడ్డి గారికి శాలువా పూలమాలలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జీవానంద రెడ్డి గారి చేతులమీదుగా కేక చేసి ట్రస్ట్ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు దుస్తులు పండ్లు పలహారాలు పంపిణీ చేశారు. జీవానంద రెడ్డి గారు మాట్లాడుతూ పిజెఆర్ ట్రస్ట్ ను ముందుకు తీసుకెళుతూ ట్రస్ట్ కోసం కష్టపడుతున్న నా కుటుంబ సభ్యులైన ట్రస్టు సభ్యులకు నా సొంత నిధులతో నూతనంగా గృహాలు ఏర్పాటు చేస్తానన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్తానన్నారు.పిజెఆర్ ట్రస్ట్ గుత్తి ఇన్చార్జ్ కరిడికొండ సూరి మాట్లాడుతూ పి జే ఆర్ ట్రస్ట్ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తిచేసుకుని 14వ సంవత్సరం అవుతుందని ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు సహాయాలు అందించడం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. 24×7 ఉచిత అంబులెన్స్ లు గుంతకల్ నియోజకవర్గం పామిడి గుత్తి మండలాలలో గర్భవతులు,లేక ఆరోగ్యం బాగా లేకపోయినా యాక్సిడెంట్లు అయినా మొదట స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లి అవసరమైతే జిల్లా కేంద్రం హాస్పటల్ కి ఉచిత ఆంబులెన్స్ లో తీసుకెళ్తారు. కైలాస రథలు ఎవరైనా మరణిస్తే స్మశాన వాటికకు తరలించడం, ఎక్కడైనా యాక్సిడెంట్ అయి చనిపోతే పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించడం అక్కడ నుంచి చనిపోయిన వ్యక్తి ని స్వగ్రామానికి ఉచిత కైలాసరతంలో తీసుకెళ్లడం జరుగుతుందన్నారు ఫ్రీజర్ బాక్స్ మరణించిన వ్యక్తి ని ఫ్రీజర్ బాక్స్ ( ఏసి )లో ఏర్పాటు కోసం ప్రిజర్ బాక్స్ ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. ఉచిత బస్సులు పెళ్లిళ్లు శ్రీమంతం దేవర శుభ కార్యాలకు ఉచితంగా రెండు బస్సులు ఏర్పాటు చేశారు.

పెళ్లికి , బస్సు వెళితే ముహూర్తం పెళ్లి కూతురుని చేసిన తరువాత కుటుంబ సమేతంగా పెళ్ళికొడుకు గ్రామానికి వెళ్లి తలంబ్రాలు భోజనాలు అయిపోయాక తిరిగి స్వగ్రామం కి బస్సు వస్తుంది. రెండు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. మినరల్ వాటర్ మినరల్ వాటర్ ట్యాంకులు మూడు ఏర్పాటు చేసి శుభకార్యాలయాలకు మరియు ఏ గ్రామం నందు అయినా నీటి ఎద్దడి ఏర్పడితే వాటర్ ట్యాంకుల ద్వారా మినరల్ వాటర్ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారన్నారు . వైద్యం ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బులు ఉన్నాయని చెపుతారు కానీ ఆపరేషన్లకు వేలు వేలు ఖర్చు పెట్టలేక నిరుపేదలు అల్లాడుతున్న వారు పి జె ఆర్ ట్రస్ట్ ని సంప్రదించిన వెంటనే వైద్యం ఆపరేషన్ల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు పలు గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన వారికి ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్లు కూడా చేయించామన్నారు. విద్య యువత అభ్యున్నత కోసం పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. స్కూల్ పిల్లలు బస్సు చార్జీలు పెట్టలేక ఇబ్బంది పడుతున్న చదువుకుంటున్నా విద్యార్థుల కోసం ఉచితంగా బస్సు పాసులు పంపిణీ చేశామన్నారు. క్రీడారంగం చదువుతోపాటు క్రీడారంగంలో ముందుండాలని యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసి కబడ్డీ పోటీలు కుస్తీ పోటీలు నిర్వహించి యువతలో చైతన్యం నింపామన్నారు.
ఆలయాల నిర్మాణాలకు విరాళాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ నూతనంగా నిర్మిస్తున్న ఆలయాలకు, ఆలయాల మరమ్మత్తుల కోసం ఉత్సవ విగ్రహాల కోసం విరాళాలు అందించామన్నారు. గ్రామాలలో ఉచితంగా బోర్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సమస్య గ్రామాలకు ఉన్నాయని తెలిసిన వెంటనే మినరల్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి ఎద్దడి రాకుండా చూశామన్నారు సీసీ రోడ్లబ్రిడ్జిలు నిర్మించామన్నారు. అన్నదాన కార్యక్రమం గుత్తి పామిడి మండలాల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు ప్రతిరోజు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించామన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు పామిడి గుత్తి పెద్దవడుగూరు యాడికి లో చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతన్నల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ఇంటికో బిడ్డ ఎంత ముద్దో ఇంటికో చెట్టు అంతే అవసరమని గుంతకల్ నియోజకవర్గం లోని గ్రామాలలో లక్ష మొక్కలు నాటామన్నారు. ఆ మొక్కలు ఈరోజు పెద్ద చెట్లు అయ్యాయన్నారు.
యువతకు ఉపాధి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వ్యాలీ గ్రీన్ గార్మెంట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందులో 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఎక్కువగా మహిళల ఉపాధి కోసం ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నానన్నారు. గత సంవత్సరం నుండి మహిళలకు కుట్టు శిక్షణ ఉచితంగా ఏర్పాటు చేసి వారికి రవాణా చార్జీలు ఇస్తూ భోజన వసతి కల్పిస్తున్నారన్నారు.
వృద్ధులకు అనాధలకు సహాయం
వృద్ధాశ్రమంలో ను యాచకులకు దుస్తులు పండ్లు ఫలహారాలు పంపిణీ చేస్తుంటామన్నారు.
వివాహాలకు ఆర్థిక సహాయాలు 32 గంటలకు సమూహ వివాహాలు అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రతి జంటకు గోమాత వితరణ చేశారన్నారు.పెళ్లి అని ఎవరైనా వస్తే వారికి తాళిబొట్టు మెట్టెలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు దుస్తులు అందచేస్తున్నామన్నారు. పీజేఆర్ ట్రస్ట్ సభ్యుడు మాట్లాడుతూ మహేంద్ర మాట్లాడుతూ
ప్రజా సమస్యలపై పోరాటం పెరుమాళ్ళ జీవానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకెళుతూ వైసీపీ అరాచక పాలన చేస్తున్నా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. పామిడి పెన్నా నదిలో అక్రమంగా ఇసుక ను తోడేస్తున్నారని ఇసుకాసురులను అడ్డుకోవాలని వంక రాజు కాలువ గ్రామ ప్రజలు జీవానంద రెడ్డి ని సంప్రదించగా జీవానంద రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్రమ ఇసుక రవాణా ని నిలిపి వేశారన్నారు. గుత్తి పట్టణంలోని కాలనీలలో 20 రోజులకు ఒక్కసారి నీటిని వదులుతున్నారని డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని వైసీపీ నాయకులు అధికారులపై కదం తొక్కి పోరాటం చేశారు.పామిడి మండలం పలు కాలనీలలో పర్యటించి రోడ్లు వసతి నీటి వసతి లేవని ప్రజలు విన్నవించగా జీవానంద రెడ్డి సొంత నిధులతో నీటి వసతి కల్పించి రోడ్డు వేయించారన్నారు. పామిడి బస్టాండ్ లో డ్రైనేజీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని జిల్లా అధికారులతో మాట్లాడి డ్రైనేజీ సమస్య తీర్చారన్నారు సర్పంచుల నిధుల లని వాడుకున్నారని పోరాటాలు చేశారన్నారు. కరెంటు చార్జీలు పెంచడం పై పోరాటం చేశారన్నారు.మూడు కోట్లు ఖర్చు చేసి పామిడి పెన్నా నది బ్రిడ్జి నాణ్యత లేదని. వాటిపై కదం తొక్కారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రజలకు సమస్య వచ్చిందంటే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వారి సమస్యలు తీరుస్తున్నారన్నారు.
తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ జీవానంద రెడ్డి ఒక పక్క సేవా కార్యక్రమాలు మరోవైపు తెదేపా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లలో తెదేపా అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించి మహానాడు మినీ మహానాడు కార్యక్రమాలకు తనతోపాటు ట్రస్టు సభ్యులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆ కార్యక్రమంలో పాల్గొనించడం మాకు సంతోషకరంగా ఉందన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేయించి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేసి పార్టీ కోసం కష్టపడుతున్నారన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలను
మహాశక్తి 18 ఏళ్లు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నీది కింద నెలకు 1500 రూపాయలు తల్లివందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణం, అన్నదాత ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం యువ గళం ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3000 రూపాయలు . బీసీలకు రక్షణ బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారు పూర్ టు రిచ్ పేదలను సంపన్నులను చేసి ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు ఇంటింటికి నీరు ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా కులాయి కనెక్షను
అని మహాశక్తి రతాన్ని ఏర్పాటు చేసి గ్రామాలలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలను జీవానంద రెడ్డి కోరుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమవుతుందన్నారు.
పిజెఆర్ ట్రస్ట్ సభ్యుడు పాలాక్షి రెడ్డి మాట్లాడుతూ పెరుమాళ్ళ జీవానంద రెడ్డి ( పీజేఆర్ ) ఎంతో నిష్ట నియమ నిబంధనలతో శివమాల ధరించి ప్రతి సంవత్సరం అనంతపురం జిల్లా నుండి మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం వరకు శివనామ స్మరణంతో పాదయాత్ర చేస్తున్నానన్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ మూడుపూటలా భోజన వసతి కల్పిస్తున్నారన్నారు. శ్రీశైలంలో భక్తాది భక్తుల కోసం నాలుగు రోజులపాటు అన్న సేవా కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. మహా పుణ్యక్షేత్రం శ్రీ కైలాస దేవస్థానం నందు 54 అడుగుల శివలింగం నవ పాషాణ లింగం ఏర్పాటు చెయ్యాలని, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని మూడు సంవత్సరాలుగా శివ మాల ధరించి తెదేపా పార్టీ గెలుపు కోసం ముందుకెళుతూ శ్రీ కైలాస దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పీజేఆర్ ట్రస్ట్ సభ్యులు, పీజేఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్