యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) కి మద్దతు పై సీఎం జగన్ పై ప్రధాని మోడీ ఒత్తిడి..!!

Spread the love

జనసముద్రం న్యూస్, అమరావతి, జూలై 10:

వైసీపీలో ఒక విషయం ఆసక్తికర చర్చగా మారింది. ఇప్పటి వరకు కేంద్రంతో రాసుకుని పూసుకొని తిరుగుతు న్న విషయం గోప్యంగానే ఉన్నా.. తాజాగా అది కాస్తా బహిర్గతం అయిపోయింది. ఇప్పుడు ఈ విషయంపైనే నాయకుల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. “మోడీ అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది!“ అని కీలక నాయకుడు వ్యాఖ్యానించడం.. తాడేపల్లి వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ముందు.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు హిందూ సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు ఈ బిల్లును మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును పెట్టి ఆమోదించుకు నేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే.. లోక్సభలో మోడీకి తిరుగులేదు. దీంతో ఈ విషయంపై బెంగలేదు.

కానీ ఎటొచ్చీ.. రాజ్యసభలోనే ఇబ్బందులు ఉన్నాయి. ఈ సభలో కాంగ్రెస్ సహా విపక్షాల బలం ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ తమకు దన్నుగా నిలిచే వారు కావాలి. ఈ క్రమంలో వారికి జగన్ తురుపు ముక్కలా కనిపించారు. దీంతో లోక్సభలో ఎలా ఉన్నా.. రాజ్యసభలో మాత్రం మాకు మద్దతు ఇచ్చితీరాలని.. జగన్పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో వైసీపీ అధినేతకు చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.ఇదే విషయంపై వైసీపీలోనూ చర్చసాగుతోంది. ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తే.. మైనారిటీ ప్రజల్లో జగన్కు ఉన్న సానుభూతి.. పూర్తిగా గల్లంతవుతుందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగు తున్న ఈ పరిణామం పెద్ద దెబ్బగా మారుతుందని అంటున్నారు. మోడీకి అన్నీ తెలిసే.. ఇలా చేస్తున్నారా?   ఉద్దేశ పూర్వకంగానే వైసీపీని ఇరికిస్తున్నారా? అని సీనియర్ నాయకులు మథన పడుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్