పేదలకు సేవ చేయాలనే తపన కలిగిఉండాలి – మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు.

Spread the love

@ ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,కరకగూడెం, జూలై 15.

సమాజంలోని పేదలకు సేవ చేయాలనే తపన ప్రతీ ఒక్కరిలో రావాలని మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. కరకగూడెం మండల పరిధిలోని రేగళ్ల ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్
సికింద్రాబాద్’ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో ఆ పాఠశాల, రేగళ్ల వలస ఆదివాసీ గ్రామ విద్యార్థులతో పాటు అంగన్ వాడీ చిన్నారులతో కలిపి మొత్తం 150 మందికి మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు చేతుల మీదుగా బ్యాగులు,నోట్ పుస్తకాలు,పలకలు డ్రాయింగ్ కిట్స్ ,సోలార్ లైట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, లక్ష్య సాధనతో కష్టపడి చదివితేనే విజయం సాధించగలరని ఎవ్వరూ కూడా సమయాన్ని వృధా చేయరాదని పేర్కొన్నారు.ప్రాథమిక స్థాయి నుండే లక్ష్యంవైపు అడుగులు వేసే విద్యార్థులకు విజయావకాశాలు ఎక్కువగా దక్కుతాయిని, విద్యార్థి దశ నుంచే ఉన్నత విలువలతో కష్టపడి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అంతేకాకుండా
విద్యార్థులు,యువత అనుకున్నది సాధించాలంటే మనస్సును అదుపులో ఉంచి పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు కృషిచేసి మంచి నైపుణ్యం ద్వారా లక్ష్యం సాధించి, ప్రతిభావంతులుగా నిలవాలని, విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా దృఢ సంకల్పంతో వాటిని అధిగమించి ఆసక్తి ఉన్న రంగాలలో ముందుకు సాగడం ద్వారా మంచి ప్రతిభావంతులు కావచ్చని అన్నారు.ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.అదేవిధంగా ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయంమని పేర్కొన్నారు.

అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ… ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేద ప్రజలకు మరిన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ రాజగోపాల్,కరకగూడెం ఎస్సై రాజారామ్,స్థానిక సర్పంచ్ కుంజ వసంతరావు,రేగళ్ల పాఠశాల హెచ్ఎం నర్సింహరాజు,గ్రామస్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్