
*
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం (విలేజ్) గుండ్రాతి మడుగు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిరసన కార్యక్రమం ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ మాట్లాడుతూ… పాఠశాలలో నెలకొన్న సమస్యల వలన విద్యార్థులు సతమతమవుతున్నారు , విద్యాసంవత్సరం ప్రారంభమై దరి దాపుగా 24 రోజులు పైబడి అయిన విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంలో విఫలం అయింది కావున ఇట్టి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి సకాలంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్ బుక్స్ అందించాలని కోరారు. విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు టాయిలేట్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థకు చేరిన గదులు కూలగొట్టి, వాటి స్థానంలో నూతన గదులు నిర్మించాలి తెలిపారు. ఫ్యాన్లు, లైట్లు , బెంచీలు విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు త్రాగు నీరు సమస్యను పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చాలీచాలకనిధులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని భోజనం నాణ్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలని బానోత్ దేవేందర్ డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు చేరే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండ మట్టి పోయించాలని అన్నారు. తక్షణమే ఈ విషయాలపై స్పందించి విద్యార్థులకు న్యాయం చేకూర్చే గలగాలని లేనియెడల పిడిఎస్యు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని పూనుకుంటామని పిడిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.





