గుడిసె వేసుకున్న ప్రతి పేదవాడికి భూమిని ప్రభుత్వమే పంచాలి.:నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి

Spread the love

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)
ప్రభుత్వ భూమి గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికి భూమిని పంచి పట్టాలివ్వాలని సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు .
సిపిఐ కొరివి మండల సమితి ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న పేదలచే గుడి సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ఎర్రజెండాలు చేబుని ప్రదర్శన, ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ ఎండి రఫీ గారికి గుడిసెలు వేసుకున్న పేదవారి జాబితా చే వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు, ఇల్లు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విసిగిపోయిన ప్రజలు ఎర్రజెండా అండతో ప్రభుత్వ స్థలాలలో పేదలే గుడిసెలు నిర్మించుకుంటున్నారని ఇట్టి స్థలాలను గుర్తించి ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరి చేయాలని డిమాండ్ చేశారు .
గత పది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విధానాల వలన నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేదవాడికి కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని, హంగు ఆర్భాటాలచే ప్రజలను ఏ విధంగా మాయ చేసి ఓట్లు దండుకోవాలని ఆలోచన తప్ప ఆచరణలో పేదవాడికి సాయం చేయాలనే ఆలోచన ఏమాత్రం కనబడటం లేదని ఇలాంటి ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
188 సర్వేనెంబర్ లోని భూమిలో గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికి భూమి దక్కేవరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కర్ణం.రాజన్న,జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, బుర్ర సమ్మయ్య, కన్నె వెంకన్న ,బసవ కొమరయ్య బుడమ వెంకన్న దూది కట్ల సారయ్య బూర్గుల కృష్ణ ఉప్పలయ్య అప్పల వెంకన్న కోడి మధు వీరభద్రం రాధ కర్ణం రమణ శిరసాని సరిత సముద్రాల ధనమ్మ దైవ సుశీల తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి