
జనసముద్రం న్యూస్, ,వెంకటగిరి,తిరుపతి జిల్లా, జూలై 01:
వెంకటగిరి అయ్యప్ప స్వామి దేవాలయం నిధులు స్వాహా చేస్తున్న దేవాలయ కమిటీ సభ్యులు, దీనిపై ఆలయ కమిటీ ధర్మకర్త చిట్టామూడి వెంకటరాయులు పలు సార్లు ఎండోమెంట్ శాఖ వారికి లేఖలు రాయటం జరిగింది, దీనిపై ఎండోమెంట్ శాఖ తనిఖీ అధికారిని నియమించి, తనిఖీ నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టకుండా అలసత్వం వహిస్తున్నారు, ఈ అక్రమాలను సహించలేక స్థానికులు,భక్తులు ఎండోమెంట్ శాఖ వారు గుడిని స్వాధీనం చేసుకోమని వేడుకుంటున్నా పట్టించుకోని అధికారులు..ఇదే విషయం పై పలుమార్లు ఎండోమెంట్ శాఖ వారికి పలుమార్లు లేఖలు రాయటం జరిగింది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తగు చర్యలు చెప్పట్టవలసింది గా మా జనసముద్రం న్యూస్ తరుపున, ప్రజలందరి తరుపునా విజ్ఞప్తి చేస్తున్నాం












