
జనసముద్రం న్యూస్,జూన్ 30:
ఎవరు అవునన్నా కాదన్నా జనసేన అధినేత పవన్ కళ్యాన్ క్రౌడ్ పుల్లర్. ఆయనకు ఉన్న సినీ గ్లామర్ మరెవరికీ లేదు అంటారు. అంతలా పవన్ జనాదరణలో నంబర్ వన్ గా ఉన్నారు. అందుకే ఆయన వారాహి రధాన్ని చాలా నెలల పాటు షెడ్డులో ఉంచి లోకేష్ పాదయాత్రను స్టార్ట్ అయ్యేలా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు వహించారు అని ప్రచారం అయితే అప్పట్లో సాగింది.
అదే ఇపుడు నిజం అని తేలింది అంటున్నారు. ఒక విధంగా చంద్రబాబు అనుమానం నిజమే అని కూడా చెబుతున్నారు. అదేలా అంటే గోదావరి జిల్లాలలో పదిహేను రోజుల పాటు సాగిన పవన్ వారాహి యాత్రలో లోకేష్ యువగళం ఎక్కడ ఉందో కూడా తెలియనంతంగా సైడ్ అయిపోయింది. లోకేష్ అసలు పాదయాత్ర చేస్తున్నారా అన్నది కూడా మీడియాకు పట్టడం లేదు. జనాలకు అసలు ఎక్కడ పడుతుంది అన్నదే చర్చగా ఉంది.
ఎటు చూసినా పవన్ ఏ వైపు చూసినా పవన్ అలా పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీ పాలిటిక్స్ టర్న్ అయింది. ఆఖరుకు సీఎం జగన్ కూడా డోస్ పెంచి పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారంటే ఏపీలో టీడీపీ యువ నేత పాదయాత్ర ఎక్కడకి వెళ్ళిపోయిందో అర్ధం కావడం లేదు అంటున్నారు.
ఇక ఇపుడు ఒక్క విషయం మీద కచ్చితమైన రాజకీయ విశ్లేషణ అయితే ఉంది. అదెలా అంటే పవన్ కళ్యాణ్ తనకున్న బిజీలోనో లేక సినిమా షూటింగుల విషయంలోనో పడి వారాహి యాత్రను కాస్తా లేట్ చేశారు కానీ ఆయనే కనుక కాస్తా రెండు మూడు నెలలు ముందు యాత్ర మొదలెడితే మాత్రం లోకేష్ బాబు పాదయాత్రకు జనాలు కూడా ఎక్కడ రారు అని అంటున్నారు.
వారాహి యాత్ర హోరులో ఇపుడు లోకేష్ యువగళం కొట్టుకుని పోయిందని అంటున్నారు. ఇక తన తనయుడు ఎండనకా వాననకా చేస్తున్న యువగళం పాదయాత్ర ప్రస్తుత స్థితి మీద చంద్రబాబు కూడా సమీక్షించుకున్నారుట. ప్రధానంగా మీడియా ఫోకస్ అయితే యువ గళం మీద పెద్దగా లేదని ఆయన సమీక్షలో తేలిందని అంటున్నారు.
ఏపీలో అసలు లోకేష్ పాదయాత్ర అన్నది ఎక్కడ వార్తగా రావడంలేదు. టీడీపీ అనుకూల మీడియా సైతం పవన్ మాటలను ప్రకటలనే హైలెట్ చేస్తూ దాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక టీవీ చానళ్ళు అయితే తమ టీయార్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం వారాహి యాత్రనే పదే పదే చూపిస్తూ ఫుల్ ఫోకస్ పెట్టేసాయి అని అంటున్నారు.
ఈ మొత్తం పరిణామాల మధ్య చినబాబు యువగళం నలిగిపోయిందని అంటున్నారు. నిజానికి వైసీపీ కంచుకోటలో లోకేష్ పాదయాత్ర చేయడం అంటే మామూలుగా చూస్తే కొంత ఆసక్తిగానే ఉండేది. కానీ ఇపుడు అంతా ఉల్టా సీదాగా మారింది. వారాహి అంటూ మొత్తం ఏపీ మీడియాను జనాలను పవన్ ఓవర్ టూ గోదావరి అనేస్తున్నారు.
అందుకే జగన్ సైతం ఇటీవల ప్రసంగించిన రెండు జిల్లా సభలలో సైతం పవన్ మీదనే హాట్ కామెంట్స్ చేశారు. దానికి జనసేన నుంచి అటాక్ రావడంతో వైసీపీ వర్సెస్ జనసేనగా పొలిటికల్ సీన్ ఏపీలో మారింది అని అంటున్నారు. ఇక జనసేన గ్రాఫ్ కూడా ఇటీవల బాగా పెరిగింది అని అంటున్నారు.
పవన్ కల్యాణ్ తీరిక ఓపికా చేసుకుని ఎన్నడూ లేని విధంగా ఒక పదిహేను రోజుల పాటు గోదావరి జిల్లాలలో చేసిన యాత్రతో ఏపీ పొలిటికల్ సీన్ కొత్త మలుపు తీసుకుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ జస్ట్ ఇలా వచ్చి అలా తిరిగి వెళ్తేనే యువగళం ఊసు లేకుండా పోతే పవన్ కంటిన్యూస్ గా జనంలో ఉంటే అపుడు చినబాబు పాదయాత్ర పాట్లు చూసే మీడియా ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా పవన్ ముందు లోకేష్ బాబు తేలిపోతాడని ముందుగానే ఊహించి కొడుకుని చాలా ముందుగా జనంలోకి పంపించి ఎంతో కొంత మీడియా ఫోకస్ అపుడే ఉండేలా చూసుకున్న బాబు ప్లాన్స్ అదుర్స్ అని అంటున్నారు.





