
జనసముద్రం న్యూస్,జూన్ 30:
వైసీపీకి రాజకీయ ప్రకాశంగా ఉన్న కీలక జిల్లాలో సిట్టింగులకు వారి తీరు వల్లనే టికెట్ విషయంలో కొన్ని సీట్లలో డౌట్ కొడుతొందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం నుంచి అపాయింట్మెంట్ రావడంలేదు అంటున్నారు. చాలా సార్లు సీఎం అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టినా కూడా సీఎం ఓ ఆఫీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడంలేదు అని వారి అనుచరులు అంటున్నారు.
ఆ ముగ్గురూ రెడ్ల సీట్లలో ఆధిపత్యం చేస్తున్న వారే అని అంటున్నారు. ఇక ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రెడ్లు కాకున్నా రెడ్ల మీద పెత్తనం చేస్తూ రెడ్లను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. వీరి విషయాలు వ్యవహారాలు హై కమాండ్ వద్ద అన్ని ఆధారాలతో సహా ఉన్నాయని అంటున్నారు.
పీకే టీం ఇచ్చిన నివేదికలు సైతం అధినాయకత్వం దగ్గర ఉండడంతోనే వీరి సీట్లు చిరిగిపోయాయని టాక్ అయితే నడుస్తోంది. ఇక వారికి ఈసారి టికెట్లు వచ్చే అవకాశం తక్కువే అని ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది.
ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే సొంతంగా చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ వైసీపీ క్యాడర్ కి ఎక్కడా ఏమీ ఇవ్వకుండా వారిని సైతం ఇబ్బంది పెడుతూ తాను మాత్రం బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు అని అంటున్నారు. అంటే ఈయన గారి యాపారం యమ దర్జాగానే ఉంది అన్న మాట. మధ్యలో గెలిపించిన వారే నరకం చూస్తున్నారు అని అంటున్నారు
ఇక ఇంకో ఎమ్మెలెయ గారి తీరు చూస్తే మండలానికి ఒకరు వంతున తన సొంత మనిషిని పెట్టి అలా ఎమ్మెల్యే తమ్ముడి ఆద్వర్యంలో ఇదంతా చేస్తూ బాగానే వసూళ్ళు చేస్తున్నారని వసూల్ రాజాలుగా మారిపోతున్నారు అని అంటున్నారు. అక్కడ ఇక్కడ కూడా బాగానే కధ సాగుతోంది అన్న మాట.
ఇక మరో ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యే తనయుడు అయితే ఏకంగా రెడ్ల మీదనే విరుచుకుపడుతూ తన తండ్రి చేతిలో ఉన్న అధికారాన్ని అలా అనుభవిస్తూ ఒక బలమైన సెక్షన్ మీదనే విషం చిమ్మే పనులు చేస్తున్నారుట. సోషల్ మీడియాలో తన మనుషులను పెట్టించుకుని మరీ రెడ్లను ఎంతలా బాడ్ చేయాలో అంతలా చేస్తున్నారు అని అంటున్నారు. ఇది కాస్తా ఒవరైపోతే సదరు ఎమ్మెల్యే తనయుడి మీద స్థనిక రెడ్డి నాయకులు అంతా కలసి డీఎస్పీకి ఫిర్యాదు సైతం చేశారని అంటున్నారు.
దీన్ని బట్టి చూస్తే ముగ్గురుకీ ముగ్గురూ అన్నట్లుగా ఎవరి లెవెల్ లో వారు చేయాల్సింది చేసుకుంటూ 2024 కోసం అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. అయితే లోకల్ గా విషయాలు అన్నీ ఎప్పటికపుడు హైకమాండ్ పెద్దల చెవిన పడడంతోనే అక్కడ నుంచే వీరికి రెడ్ సిగ్నల్ చూపించేలా నో అపాయింట్మెంట్ అని వస్తోందని టాక్. దీన్ని అంతా గమనిస్తున్న వారు మాత్రం మూడు సీట్లూ చిరిగిపోయినట్లే. ఇది పక్కా రాసుకో సాంబా అని అనేస్తున్నారుట. అదన్న మాట ప్రకాశం జిల్లా అధికార పార్టీలోని ఆ ముగ్గురు పాలిటిక్స్ వెనక స్టోరీ.





