కుప్పంలో ఓ ఇంట్లో భారీ పేలుడు..దంపతులకు తీవ్ర గాయాలు

Spread the love

రాయలసీమలో నాటుబాంబు ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జనావాసాల్లో నాటుబాంబు పేలడం తీవ్ర కలకలం రేపుతోంది.

కర్నూలు జిల్లా పత్తికొండలో పొలం పనులు చేస్తుండగా.. కవర్లో దాచి పెట్టిన నాటుబాంబు పేలి ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు ఒకే ఇంట్లో 26 నాటుబాంబులు దొరకడంతో చుట్టుపక్కల వాళ్ల ఆందోళనకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం బస్టాండ్ వద్ద నాటుబాంబు పేలడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడో దాచి ఉంచిన నాటుబాంబును ఒక కుక్క పొరపాటున నోట కరుచుకుని తీసుకురావడంతో అది పేలింది. పేలుడు ధాటికి కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. తెల్లవారుజామున కావడం, జన సందోహం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాటుబాంబు ధాటికి అక్కడున్న అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

గతంలోనూ ఇదే చిత్తూరు జిల్లాలో నాటుబాంబు కొరికి కుక్క మృతిచెందింది. నిమ్మనపల్లి మండలం ముస్టూరు పంచాయతీ కొత్తవలసపల్లికి చెందిన పేరం పెద్ద రెడ్డప్ప, శ్రీనివాసులు అడవి పందుల వేట కోసం పలమనేరు ప్రాంతం నుంచి నల్ల మందు తెచ్చి.. నాటు బాంబు తయారు చేసి ఇంటిపైన ఆరబెట్టారు. ఆ ఆరబెట్టిన నాటుబాంబును కాకి తీసుకెళ్లి ఒక కుక్క దగ్గర పడేయడంతో.. దాన్ని కొరికి కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. ఇలా వరుస సంఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్