

మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా శామీర్ పేట జన సముద్రం న్యూస్ జూన్ 20
మంగళవారం శామీర్ పేట లో తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా, ఎడ్యుకేషన్ డే ను పురస్కరించుకుని గురుకుల మైనారిటీ పాఠశాల , కళాశాల లో, బిసి గురుకుల పాఠశాల, కళాశాల లో జాతీయ జెండాను ఎగురవేయటం జరిగింది. తదుపరి కార్యక్రమం లో విద్యార్థులకు జెడ్పీటీసీ అనితా లాలయ్య, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ లు పుస్తకాలు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్, జెడ్పీటీసీ అనితా లాలయ్య లు మాట్లాడుతు గురుకుల పాఠశాల, కళాశాల లో అధ్యాపకుల కృషి ని ప్రశంసించారు. సిఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం లో గురుకుల పాఠశాలల స్థాపన చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు తండ్రి లాగా సహాయం చేస్తున్నారని, కేసిఆర్ గారి ఈ పధకాలే దేశం లో ఆదర్శంగా నిలుస్తున్నాయని అఫ్జల్ ఖాన్, అనితా లాలయ్య లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్, అనితా లాలయ్య తో పాటు గురుకు మైనారిటీ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్ క్రిష్ణ, బిసి గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్ సునీత , ఉమ , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
