
జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 31 :తుపాకుల రమేష్
బుధవారం శామీర్ పేట లో ని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ నూతన గృహానికి తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్ ఫిప్ చైర్మన్ దూది మెట్ల బాల్ రాజ్ యాదవ్ విచ్చేసి న సందర్భంగా అఫ్జల్ ఖాన్ దూది మెట్ల బాల్ రాజ్ యాదవ్ ను ఆయన సతీమణి రాజేశ్వరి ని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దూది మెట్ల బాల్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న అఫ్జల్ ఖాన్ కు మంచి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన వంతు గా అఫ్జల్ ఖాన్ కు మంచి పదవి రావడానికి సహకరిస్తానని బాల్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ రాజ్ యాదవ్, అఫ్జల్ ఖాన్ తో పాటు మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ చాప భాస్కర్ యాదవ్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు చీర వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పవన్ , లింగం పల్లి సర్పంచ్ కే వెంకటేష్, మహ్మద్ గౌస్, ముదిరాజ్, బుర్క వెంకటేష్, తిరుపతి రెడ్డి,మధు,నవీన్, తదితరులు పాల్గొన్నారు.





