యువత చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలి:ధనసరి సూర్య.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, మే 30.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గూడెం పంచాయితీ లోని యువత కి పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువనేత దనసరి సూర్య, సోషల్ మీడియా వారియర్ అచ్చా నవీన్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా సూర్య మాట్లాడుతూ ఆటలతో శరీరానికి వ్యాయామం అవుతుందని విద్యార్థులు, యువకులు క్రీడలలో రాణించి భవిష్యత్ కి పునాది వేసుకోవాలని తెలిపారు.ఆటలను దిన చర్యలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని,యువత ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువులు, క్రీడాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు.విద్యతో పాటు క్రీడల పట్ల కూడా అసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.అలాగే ఆటలలో రాణించి మీ గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని యువత కి పలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుగొండ సాంబశివరావు,యూత్ నాయకులు బండారు గిరి ప్రసాద్, పినపాక మండల నాయకులు పొనుగోటి చందర్రావు,మణుగూరు మండల నాయకులు పల్లపు సంపత్, రసమళ్ళ నాగరాజు, కొమరం హార్శ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి