జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,పినపాక, జూన్ 3.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జగ్గారం గ్రామంలో దుర్గం సమ్మక్క భర్త నారాయణ బ్రెయిన్ ట్యూమర్ తో గత కొంతకాలంగా బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పినపాక మండల నేతకాని సంఘం నాయకులు దుర్గం సమ్మక్క చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి దశదినకర్మల నిమిత్తం 25 కేజీల బియ్యం కొంత నగదును ఆర్థిక సహాయంగా అందించారు.సహాయం అందించిన నేతకాని సంఘం నాయకులకు మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య ,టీఎన్ఎంఈఓ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జిమ్మిడి శివశంకర్ ,పినపాక మండల నేతకాని సంఘం అధ్యక్షుడు గుమాసు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు ఆర్ఎంపి, సహాయ కార్యదర్శి జాడి కిరణ్ ,గుమాస సురేందర్ ,నరసింహారావు, సల్లూరి లక్ష్మీనారాయణ, జిమ్మిడి వెంకటేశ్వర్లు ,కొండ గొర్ల రమేష్,గుమాస్ రవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.