అంగరంగ వైభవంగా మిర్యాలగూడ పట్టణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం..

Spread the love

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి,….

దామరచర్ల పవర్ ప్లాంట్ లో అక్కడ లోకల్ వారికి ఉద్యోగాలు కల్పించాలి..

మిర్యాలగూడ ను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న భాస్కర్ రావు , తిరునగరు భార్గవ్,….

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 26:

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మిర్యాలగూడ పట్టణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నియోజకవర్గం లోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనల ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్యశాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ ను సందర్శించి రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, 100 పడకల ఆసుపత్రిని చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..

మిర్యాలగూడ నియోజకవర్గం దిశ,దశ మారుస్తున్నటువంటి వ్యక్తి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అని అన్నారు . మిర్యాలగూడలో 4,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 100 పడకల ఆసుపత్రికి 16 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, చిన్నపిల్లలకు పిడి అట్రిక్ ఐసి, బ్లడ్ బ్యాంక్, సిటీ స్కాన్ మంజూరు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 60 ఏండ్ల అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని, ఒక లక్ష 50 వేల ఉద్యోగాలు కెసిఆర్ పాలనలో ఇచ్చామని, 17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి వాళ్లు విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తారని కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సూర్యాపేటలో రెండు మెడికల్ కాలేజీలు తెచ్చామని,తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగులో… కళ్లద్దాలు, కంటి పరీక్షలు జరిపావని తెలిపారు. 80,000 ల మంది సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందారని, పెద్ద నోట్ల రద్దు, రెండేళ్లలో కరోనా… ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చిన అభివృద్ధి పనులు ఆగలేదని అన్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ పుట్టినరోజు 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10 వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 22 వరకు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. తెలంగాణ పరిపాలన చూసి దేశమంతా శభాష్ అని అంటున్నారని, రాబోయే ఎన్నికలలో కార్యకర్తలు,… అందరం కలిసి బిఆర్ఎస్ పార్టీ జెండాను ప్రతి నియోజకవర్గంలో గెలిపించి ఎగరవేయాలని, భాస్కర్ రావుని మూడోసారి గెలిపించాలని,… అన్నారు.

గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..

అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల ప్రారంభోత్సవానికి, ఆత్మీయ సమ్మేళ న కార్యక్రమానికి విచ్చేసిన… వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటగా తాను నమ్మిన సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో,… లలో అభివృద్ధి పనులు చేయాలనిఅన్నారు. గత నాలుగున్నర సంవత్సరంలో భాస్కర్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ, సూర్యాపేట కంటే ఎక్కువ నిధులు తీసుకొని వచ్చారని అన్నారు. దామరచర్ల లో అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కెసిఆర్ దయవల్ల పేరు వచ్చిన వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇది సబబు కాదని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఐదు లక్షల బోరు బావులున్న జిల్లా నల్గొండ జిల్లా అని అన్నారు. ఒక్కొక్క రైతు 20,30 బోర్లు వేసి నాశనం అయ్యారని, భార్యల పుస్తెలతాడులమ్మి అప్పుల పాలయ్యారని, కొంతమంది ప్రాణాలు తీసుకున్నారని తమ బాధను వ్యక్తపరిచారు. కేవలం వ్యవసాయం మీద నల్గొండ జిల్లా బ్రతుకుతుందని , కొన్ని పార్టీల నాయకత్వవలనే జిల్లా నాశనం అయిందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణాలలో,… లలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను ప్రతి నాయకుడు ఏమి తెలుసుకున్నారు…? అని జగదీశ్వర్ రెడ్డి అడిగారు. నాగార్జునసాగర్ చివరి పొలాలకు నీళ్లు ఇవ్వగలిగామని, జిల్లా నుంచి తిప్పర్తి,మిర్యాలగూడ మీదుగా వచ్చే రహదారిలో పచ్చటి పొలాలు కనబడుతున్నాయని, వరుసగా 16వ పంటకు నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. దామరచర్ల లో 48 కోట్ల పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం వలన మిర్యాలగూడ రూపురేఖలు మారిపోతాయని,… అన్నారు.

నల్లమోతు భాస్కర్ రావు, తిరునగరు భార్గవ్ లు మాట్లాడుతూ..

మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 28 పల్లె దవాఖానాలు ప్రారంభం అయ్యాయని అన్నారు. మిర్యాలగూడను 34వ జిల్లాగా ఏర్పాటు చేయాలని నల్లమోతు భాస్కర్ రావు, తిరునగరు భార్గవ్ ,… లు కోరారు. కెసిఆర్,కేటీఆర్… 15 కోట్ల 80 లక్షల రూలు ఏరియా ఆసుపత్రిలకు, మిషన్ భగీరథ పనులకు రెండోసారి 96 లక్షలు, మంజూరు చేశామని, మిర్యాలగూడలో ప్రతి ఇంటిలో నీటి కొరత లేకుండా చేయడమే లక్ష్యమని భాస్కర్ రావు అన్నారు. 13 ప్రభుత్వ పాఠశాలలు, సిసి రహదారులు, 48 వార్డులలో అంతర్గత సీసీ రోడ్లు, కోదాడ రోడ్డు టు గుంటూరు రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి నివారణ, వైకుంఠధామం, మిషన్ కాకతీయ, రైల్వే స్టేషన్ రోడ్ నుండి ఈదుల గూడ వరకు రోడ్ల నిర్మాణం,.. కోట్లు మిర్యాలగూడకు కేసీఆర్ ఇచ్చారని భాస్కర్ రావు అన్నారు. అంతేకాకుండా యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో అక్కడ నివాసులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని,… హరీష్ రావు, జగదీశ్ రెడ్డి లను భాస్కర్ రావు కోరారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీని గెలవనీయమని , ప్రతి కార్యకర్తకు,… లకు అండగా నేను ఎల్లప్పుడూ ఉంటానని, రాబోయే ఎన్నికలలో బి ఆర్ ఎస్ ను గెలిపించి బి ఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు బండా నరేందర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రవీందర్ కుమార్ , ఎంసీ కోటిరెడ్డి, భూపాల్ రెడ్డి,నోముల భగత్, తిప్పన విజయ సింహ రెడ్డి , తిరునగరు భార్గవ్, జడ్పీ చైర్ పర్సన్లు, జడ్పిటిసిలు, డీసీఎంఎస్ చైర్మన్లు , వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ అధ్యక్షులు,… లు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్