మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జన సముద్రం న్యూస్ మే 26
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా
నిరంతరం బిఆర్ఎస్ పార్టీ కోసం శ్రమించే అఫ్జల్ ఖాన్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ముందు ముందు మంచి నామినేటెడ్ పదవులు రావచ్చని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మహ్మద్ అమీర్ అన్నారు. శుక్రవారం శామీర్ పేట లో మేడ్చల్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం అద్యక్షులు , గాయకుడు ర్యాకల రవి గౌడ్ అఫ్జల్ ఖాన్ నివాసానికి చేరుకొని మెమెంటో సమర్పించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రాజకీయ కార్యక్రమాల తో పాటు పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం అఫ్జల్ ఖాన్ కు వెన్న తో పెట్టిన విద్య అని ర్యాకల రవి గౌడ్ అన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మహ్మద్ అమీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహ్మద్ అమీర్ మాట్లాడుతు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న అఫ్జల్ ఖాన్ కు ఎన్నో దఫాలుగా సన్మానాలు జరిగాయని, ప్రభుత్వం త్వరలో ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అమీర్, అఫ్జల్ ఖాన్, రవి గౌడ్ లతో పాటు మహ్మద్ మసీ, టీఆర్ఎస్ నాయకులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, దేశం సూరి గౌడ్ ,మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి బత్తుల శశికాంత్ యాదవ్, మహ్మద్ గౌస్, అజ్మత్, తదితరులు పాల్గొన్నారు.