జగనన్న ఇళ్లను ప్రారంభించాలి, ఎంపిడిఓ రాజ్య లక్ష్మి

Spread the love

పుల్లల చెరువు,మే 19 జనసముద్రం న్యూస్:
మండలకేంద్రమైన పుల్లల చెరువులో జగనన్న ఇళ్లను వెంటనే ప్రారంభించాలని ఎంపిడివో రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో జగనన్న లేఅవుట్1,2 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపిడివో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ఇల్లుకట్టుకొనేవారు ఎవరైనా ఉంటే హోసింగ్ అధికారులను సంప్రదించి వెంటనే శంకుస్థాపన హోసింగ్ అధికారులువరిజిస్ట్రేషన్ చేసిమ్యాపింగ్ చేస్తారన్నారు. లే అవుట్ 1లో10 మంది,లే అవుట్2లో11 మంది ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకొచ్చారన్నారు.ఈ సందర్భంగా హోసింగ్ ఎయి మాట్లాడుతూ,బేస్మెంట్ కు 70 వేల నగదు,4 కట్టల సిమెంట్, పిల్లర్లు వేసుకొంటే మూడు ట్రక్కుల ఇసుక ఇవ్వడం జరుగుతుందన్నారు.రూప్ లెవెలకు ముప్పై కట్టల సిమెంట్,ఒక ట్రిప్కు ఇసుక,నలభైవేల నగదు,142 కేజీల స్టీల్, శ్లాబుకు 20 కట్టల సిమెంట్,142 కేజీల స్టీల్,20 నుండి 30 వేల నగదు ఇస్తారని ఆయన తెలిపారు.మొత్తంమీద ఒక్కొక్క ఇంటికి 90 సిమెంట్ కట్టలు, 440 లేజీల స్టీల్ 4 త్రిప్పుల ఇసుక,ఇవన్నీ పోను నగదు,ఉపాధిహామీలో 30వేల నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు.పొదుపు కట్టే మహిళ లుంటే ఒక్కొక్క మహిళకు వెలుగు పధకం ద్వారా 35 వేల రూపాయల రుణం ఇస్తారన్నారు.ఇల్లు కట్టుకునే వారు వెంటనే ఫౌండేషన్ వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కె.జానకి రఘు, ఈవోఆర్డీ బాలునాయక్,హోసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శివలక్ష్మి,వెలుగు ఏపీఎం నూనె.వెంకటయ్య,విఆర్వో వెంకటసుబ్బయ్య, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు,వాలంటీర్లు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి