జనసముద్రం న్యూస్, మే 21:

వైఎస్ షర్మిల దివంగత నేత ముద్దుల తనయ ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చెల్లెమ్మ. ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్టీని పెట్టి మరీ రెండెళ్ళుగా తెలంగాణాలో కలియ తిరుగుతున్నారు. షర్మిల వైఎస్సార్టీపీని పెట్టి మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా పార్టీ ఏ మాత్రం పాపులర్ కాలేదు.
తెలంగాణాలో షర్మిల పార్టీకి జనాదరణ పెద్దగా కనిపించడంలేదు. ఆమె ఆరాటం పోరాటమే కానీ రాజకీయ పార్టీ విస్తరించినదీ లేదు జనాలకు చేరువ అయినది లేదు మరి ఈ ఏడాది చివరలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణా ఎన్నికల్లో షర్మిల పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా అన్న డౌట్లు అయితే ఉన్నాయి. అలా పోటీ చేస్తే అస్తిత్వం పూర్తిగా లేకుండా పోతుంది.దాంతో ఆమె పొత్తుల కోసం చూస్తున్నారు అని అంటున్నారు దీని మీద చాలా కాలంగా ప్రచారం లో ఉంది. అయితే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అన్న ప్రచారం కూడా మొదలైంది. కానీ ఆమె దీనిని మీడియా మీటింగ్ పెట్టి మరీ ఖండించారు. ఈ నేపధ్యంలో మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి అంటే కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీతో వైఎస్ షర్మిల సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపినట్లుగా టాక్ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
ఈ సందర్భంగా షర్మిలను కాంగ్రెస్ లోకి ప్రియాంకా ఆహ్వానించినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అయితే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనాన్నికి షర్మిల నో చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. అదే టైం లో ప్రియాంకా గాంధీ షర్మిలను ఏపీకి వెళ్లమని కోరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణాలో వైఎస్సార్టీపీకి ఓట్ల శాతం పెద్దగా లేదని అదే ఏపీలో అయితే వైఎస్సార్ లెగసీ ఉందని అది వర్కౌట్ అయితే కనుక కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడమే కాకుండా షర్మిలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రియాంకా గాంధీ ఆలోచనగా చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.ఈ విషయంలో షర్మిల కనుక ఒప్పుకుంటే కనుక ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తామని కూడా ప్రియాంకాగాంధీ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో విభేదిస్తున్న షర్మిల తనకు తెలంగాణాలోనే పగ్గాలు కావాలని పట్టుబట్టారని అంటున్నారు. అంతే కాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఏ రకంగానూ లింక్ పెట్టవద్దు అని కూడా కోరారని టాక్ అయితే నడుస్తోంది.
ఇక ఇది ప్రాధమికంగా జరిగిన టాక్ అని తొందరలోనే ప్రియాంకా గాంధీ వైఎస్ షర్మిల ఫ్యామిలీతో గెట్ టుగెదర్ పెట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా చర్చిస్తారు అని అంటున్నారు. మరి ఈ డిస్కషన్ లో ఏమి తేలుతుందో కానీ మరో వైపు చూస్తే తెలంగాణా రాజకీయం చేయాలని చూస్తున్న షర్మిల ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు.ఇవన్నీ పుకార్లుగానే బయటకు వస్తున్నా రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగరాదని అంటున్నారు ఇక ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ ని విజయపధంలో నడిపించిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ట్రబుల్ షూటర్ గా ఉన్నారు. ఆయన మీద తెలుగు రాష్ట్రలా బాధ్యతలను కాంగ్రెస్ హై కమాండ్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ కర్నాటకలో గెలిచిన వెంటనే షర్మిల బెంగళూరుకి వెళ్ళి మరీ డీకే తో భేటీ అయ్యారు. ఇక షర్మిలను కాంగ్రెస్ గూటికి చేర్చే బాధ్యతను డీకే తన భుజాల మీద వేసుకున్నారు అని అంటున్నారు. ఆయనే అటు హై కమాండ్ కి ఇటు షర్మిలకు మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు అని అంటున్నారు.కర్నాటకలో ప్రియాంక కాంగ్రెస్ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిపించారు ఇపుడు ఆమె చూపు రెండు తెలుగు రాష్ట్రాల మీద ఉంది అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వైపు వెళ్ళిపోయింది. అందువల్ల వైఎస్సార్ లెగసీ కూడా జగన్తోనే ఉంది. ఇపుడు అందులో చీలిక తెచ్చి వైఎస్సార్ కుమార్తెను ఏపీలో ఉంచి కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి కాంగ్రెస్ హై కమాండ్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు.
మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కానీ కర్నాటక విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండాను గట్టిగా ఏగరేయడానికి కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ కనుక పుంజుకుంటే అది కేసీయార్ కి జగన్ కి కూడా ఇబ్బందే. అదే టైం లో లాభపడే పార్టీ ఏపీలో ఏది అన్న టాక్ కూడా నడుస్తోంది.





