
జనసముద్రం న్యూస్,మే 16:

కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణా రాజకీయాల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద పొలిటికల్ ఫోకస్ కూడా పెరిగింది. కాంగ్రెస్ సీటు ఇస్తామంటే వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఇక సీనియర్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు సీట్ల కోసం డిమాండ్ పెట్టి మరీ కాంగ్రెస్ లోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.
అంతే కాదు అటు బీజేపీని ఇటు బీయారెస్ ని వ్యతిరేకిస్తున్న వారు అంతా ఇపుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని టాక్. ఒక విధంగా కాంగ్రెస్ ని గెలులు గుర్రం గా భావించే పరిస్థితి ఏర్పడుతోంది అని అంటున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ కి లభించిన అప్రతిహత విజయం ఇపుడు పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణాలో కొత్త కాంతులను వెదజల్లుతోంది. అదే విధంగా సరికొత్త ఆశలను పెంచుకొతంది అని అంటున్నారు.మరో వైపు చూస్తే రెండు సార్లు అధికారంలో ఉన్న బీయారెస్ మూడవసారి హ్యాట్రిక్ విజయం కొట్టాలని చూస్తోంది. కానీ అదంత ఈజీగా కనిపించడంలేదు ఈ నేపధ్యంలో త్రిముఖ పోరు ఉంటే ఓట్లు చీలి బీయారెస్ కి లాభించి ఉండేది అన్న ఒక అంచనా ఉంది. కానీ ఇపుడు చూస్తే సీన్ మారింది. బీయారెస్ లో కూడా కొంత మందిలో ఆలోచనలు మారుతున్నాయట.
ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా కర్నాటక ఫలితాలు తెలంగాణా జనంలో మూడ్ చేంజి చేసి కాంగ్రెస్ కి పట్టం కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. దాంతో బీయారెస్ లో ఉంటూ అంత హ్యాపీగా లేని వారు అసంతృప్తి తో ఉన్న వారు ముందు చూపుతో ఉన్నవారు అంతా కలసి ఇపుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టచ్ లోకి వస్తున్నారు అని అంటున్నారు.మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో ఇప్పటిదాకా లేనిది ఐక్యత. సీనియర్ నేతలు మోకాలడ్డే సీన్ ఉండేది. రేవంత్ రెడ్డి వంటి వారు పార్టీని జనాల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా వెనకడుగు వేయించేవారు కనిపిస్తూనే ఉన్నారు. ఇపుడు అలాంటివారిని అసలు పట్టించుకోవద్దు అన్నదే కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.పార్టీని దిగలాగే వారు ఎవరైనా కూడా పక్కన పెట్టి వచ్చే వారితో పార్టీ మీద నమ్మకం ఉంచి పోరాడే వారితోనే ముందుకు సాగాలని కూడా పార్టీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారుట. ఇక కాంగ్రెస్ లో చూస్తే ప్రియాంకా గాంధీ తాజా టూర్ తో మంచి ఊపు వచ్చింది. ఇపుడు కర్నాటక ఫలితాలు తోడు అయ్యాయి.
బీజేపీ అదే సమయంలో వెనకబడింది. రానున్న రోజుల్లో చూసుకుంటే బీయారెస్ బీజేపీల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు కాంగ్రెస్ లో ఉన్నా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా కర్నాటకం తెలంగాణా రాజకీయాన్ని మార్చేసింది అని అంటున్నారు. కాంగ్రెస్ ని మంచి రోజులు వచ్చాయని కూడా అంతా భావిస్తున్నారు.