

- గుంట భూమిలేని వారికి పట్టా పాస్.. బుక్కు పంపిణి…
- 48 గంటల గడుస్తున్న పట్టించుకోని కొల్చారం తాసిల్దార్…
- కొల్చారం రెవెన్యూ అధికారుల పని తీరు… మెదక్ జిల్లా ప్రతినిధి, (జనసముద్రం న్యూస్) మే:5 మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములను సైతం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన లో పార్ట్ బీలో పెట్టిన రెవెన్యూ అధికారులు. గుంట భూమి లేకున్నా పట్టాదారు పాసు పుస్తకం జారీ చేసిన సంఘటన లు కొల్చారం మండలంలో సర్వసాధారణంగా మారాయి. తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టా పాస్బుక్కులు ఇవ్వని రెవెన్యూ అధికారులు భూమి లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్న రెవెన్యూ అధికారులు తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కొల్చారం మండలం రంగంపేటలో సర్వే నంబర్ 231 లో సుమారు 200 కు పైగా ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమి లో గుంట భూమి లేని రైతులకు సైతం కొందరికి రెవెన్యూ అధికారులు బై నెంబర్తో పట్టా పాస్ బుక్కులు జారీ చేశారు. సర్వే నంబర్ 231/321లో గుంట భూమి లేని గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి 20 గుంటలు సాగులో ఉన్నట్లు పట్టా పాస్ పుస్తకం జారీ చేశారు. ఆ రైతుకు 10 విడతలుగా సుమారు రూ.50 వేల రూపాయలు రైతుబంధు కింద డబ్బులు వచ్చాయి. రైతుబంధు డబ్బులు రావడంతో పాటు రైతు బీమా కూడా వర్తిస్తుంది గుంట భూమి లేని వ్యక్తికి పట్టాపసుపుస్తకం జారీ చేయడం ఏమిటి రైతుబంధు రైతు బీమా వర్తింపజేయడం ఏమిటంటే గ్రామంలోని రైతులు బాటంగా ప్రశ్నిస్తున్న రెవెన్యూ అధికారులు తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తమ తప్పును సరిదిద్దుకొనడంతో పాటు గుంట భూమి లేకుండా రైతుబంధు పట్టాదారు పాసుపుస్తకం పొందిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదుచేసి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం డబ్బులు రికవరీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సర్వే చేసి చర్యలు తీసుకుంటా కొల్చారం ఎమ్మార్వో…
ఈ విషయమై కొల్చారం తహసిల్దార్ చంద్రశేఖర రావును వివరణ కోరగా సర్వే చేసి నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొల్చారం ఎమ్మార్వో తెలిపారు. ఇంతవరకు సర్వే చేయని ఎమ్మార్వో చంద్రశేఖర రావు ఇలాంటి లావాని పాటలకు ఇంతవరకు అమ్ముడు పోతున్నాడు దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.
- గుంట భూమిలేని వారికి పట్టా పాసుబుక్కుతో సహా రైతుబంధు, రైతు బీమా, అనే శీర్షిక ప్రచురించి 48 గంటలు గడుస్తున్న రెవెన్యూ అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడంపై రెవెన్యూ అధికారులపై పలు అనుమానాలు వస్తున్నాయని రంగంపేట గ్రామానికి చెందిన ప్రజలు రా పోయారు.






