బి ఆర్ ఎస్ గెలుపులో యువతదే కీలక పాత్ర : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు,మే 4.

  • పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి గులాబీ నాయకులకు పిలుపు.
  • పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీలోని పద్మశాలి భవన్ నందు పినపాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబి యువ సైన్యం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమన్నారు.పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతున్నదని భవిష్యత్ రాజకీయాలలో యువత కీలక పాత్ర పోషించాలి అన్నారు.సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వివిధ రంగాలలో ఉన్న యువత ఒకే తాటి పైకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేయాలన్నారు, యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు.పార్టీ విజయం కోసం పనిచేయాలని రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.ఎన్నికల సమయంలో కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించి పార్టీ విజయానికి కృషి చేయాలి అన్నారు. ఎన్నికలను ప్రతిష్మాత్మకంగా తీసుకొనే సమయం ఆసన్నమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్