
జన సముద్రం న్యూస్,03మే,విడపనకల్.
విడపనకల్లు మండలం కడదరబెంచి గ్రామంలో నిర్వహించిన శ్రీ మారెమ్మ అవ్వ గ్రామ దేవర కార్యక్రమంలో భాగంగా కుంభోత్సవానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం YSRCP శ్రేణులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ZPTC శ్రీ శ్రీరాములు గారు, స్థానిక సర్పంచు, YSRCP ప్రజా ప్రతినిధులు, నాయకులు & కార్యకర్తలు పాల్గొన్నారు.






