
జనసముద్రం న్యూస్,31మే,అనంతపురం.
ఒక్క రూపాయి ఫీజు లేకుండా ఉచిత విద్య కొరకు 10వ తరగతి పూర్తి అయిన విద్యార్థులు NRI విద్యాసంస్థల ట్యాలెంట్ హంట్ – 2023 ను సద్వినియోగం చేసుకోండి – జడ్పి చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు.

అనంతపురం పట్టణం లో గల NRI విద్యాసంస్థల వారు ఈ నెల 14వ తేదీ (ఆదివారం ) 10వ తరగతి పూర్తి అయిన విద్యార్థులకు ట్యాలెంట్ హంట్ -2023 అనే పేరుతో కాంపిటేటివ్ పరీక్ష నిర్వహించడం అనేది గర్వకారణం అని,ఇంటర్మీడియట్ లో చేరాలనుకునే విద్యార్థులు, 1 నుండి 10 ర్యాంకులు వచ్చిన వారికి ఒక్క రూపాయి ఫీజు లేకుండా,ఉచిత వసతి మరియు ఉచిత పుస్తకాలు ఇస్తారు.10 నుండి 20 ర్యాంకులు వచ్చిన వారికి 80శాతం ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది.20 నుండి 50 ర్యాంకులు వచ్చిన వారికి 50శాతం కన్సెషన్ ఇవ్వడం జరుగుతుందని అనంతపురం జడ్పి చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు తెలిపారు .ఈ పరీక్ష 14వ తేదీ ఉదయం 11:00 గంటల నుండి 12:30 గంటల మధ్యలో మరియు మధ్యాహ్నం 3:00 గంటల నుండి 4:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.ఈ పరీక్ష 10వ తరగతి మ్యాథ్స్ ,సైన్స్ , ఇంగ్లీష్ సిలబస్ పైన జరుగుతుందని ,పరీక్ష జరుగు స్థలం NRI విద్యాసంస్థలు,లిటిల్ ఫ్లవర్ స్కూల్ బిల్డింగ్,ఆదిమూర్తి నగర్ నందు జరుగుతాయని,ఎటువంటి సందేహాలకు అయిన 94944 72722, 96523 80088 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు . ట్యాలెంట్ హంట్ – 2023 యొక్క పోస్టర్ ను ఆవిష్కరించి ఇటువంటి మంచి కార్యక్రమాలకు మా అందరి తోడ్పాటు ఉంటుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎం.డి చంటి రెడ్డి , అకడమిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట సుబ్బయ్య , వైస్ ప్రిన్సిపాల్ శ్రీలత చౌదరి,ఏ.ఓ ప్రశాంత్,ఇంచార్జి అనిల్ , పేరెంట్ కౌన్సెలర్ పద్మ తదితరులు పాల్గొన్నారు





