
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి.శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 30.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ,జగ్గారం గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మి మృతి చెందారు.దశదిన కర్మల విషయం తెలుసుకున్న నేతకాని సంఘం నాయకులు మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి 25 కేజీల బియ్యం, కొంత నగదును అందించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య ,టిఎన్ఎమ్ఈవో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు గుమాసు లక్ష్మణ్ ,ప్రధాన కార్యదర్శి జిమ్మిడి శివశంకర్ ,పినపాక మండల నేతకాని సంఘం అధ్యక్షుడు గుమాస్ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు, ఆర్.ఎం.పి సహాయ కార్యదర్శి జాడి కిరణ్, జిమ్మిడి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ ,సుమన్, సురేందర్, బాలకృష్ణ ,వినోద్ ,సారయ్య ,నవీన్, ముత్తయ్య, నరసింహారావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





