రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు జూన్ 5న సమ్మెకు సిద్ధమవుతున్నారన్న ఎస్.కె అహ్మద్..

Spread the love

ప్రజా పంపిణీ వ్యవస్థలో 17200 మంది రేషన్ డీలర్లు చాలీచాలని కమిషన్లతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్న రేషన్ డీలర్ అహ్మద్…

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, ఏప్రిల్ 26:

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు వద్ద ప్రెస్ క్లబ్ లో విలేఖర్ల…. రేషన్ డీలర్ల సమావేశం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న 17200 మంది రేషన్ డీలర్లు చాలీచాలని కమిషన్లతో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో పోషణ భారం భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో 2023 సంవత్సరం జూన్ 5న రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు సిద్దమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుండి రేషన్ డీలర్ల న్యాయమైన కోరికలను తీర్చటంలో విఫలమైనందున వెంటనే ప్రభుత్వం డీలర్ల నాయకులతో చర్చలకు పిలిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల జూన్ ఐదో తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. సమ్మెకు సన్నాకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 2000 మంది రేషన్ డీలర్లతో మే ఒకటో తారీకు నాడు నార్కట్పల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో పెద్ద ఎత్తున గౌరవ వేతన సాధన సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా జాక్
చైర్మన్ నాయి కోటి రాజు, వైస్ చైర్మన్ బత్తుల రమేష్ బాబు, కన్వీనర్ దొమ్మాటి రవీందర్, కో కన్వీనర్ గడ్డం మల్లికార్జున గౌడ్ మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల జాక్ నాయకులు పాల్గొంటారు.

ముఖ్యంగా రేషన్ డీలర్ల డిమాండ్స్….

1.రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం 30 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 35000, మెట్రోపాలిటీ సిటీలలో 40 వేల రూపాయలు చెల్లించాలి.
2.ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించిన కమిషన్ వెంటనే రిలీజ్ చేయాలి.

  1. రేషన్ డీలర్ల సమస్యలపై ఏర్పాటుచేసిన ఐదుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం నివేదిక ఆధారంగా వేతనం, లేదా ఒక క్వింటల్ కు 300 రూపాయల కమిషన్ కు తక్కువ కాకుండా ఇవ్వాలి.
  2. ఐ ఎం జి గోదాముల నుండి ప్రతి క్వింటాల్ కు ఐదు,ఆరు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నందున వే బ్రిడ్జిల ద్వారా తూకంతో బియ్యము సరఫరా చేయాలి.
  3. రేషన్ డీలర్లు చనిపోతే దహన సంస్కారాలకు 30,000 రూపాయలు ఇవ్వాలి .
  4. గన్ని బ్యాగ్స్ కు 30 రూపాయలు చెల్లించాలి.
  5. గ్రూప్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఇప్పించాలి.
    ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు పగిళ్ల వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు ఉబ్బపల్లి వెంకటేష్, కార్యదర్శి ధైద మనోహర్, రూరల్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ఏడు మండలాల ఐఎంజి అధ్యక్షులు మహమ్మద్ అహ్మద్, వేములపల్లి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వెంకటయ్య, మాడుగుల పల్లి అధ్యక్షులు సోమన్న, కార్యదర్శి పిచ్చయ్య, అధ్యక్షులు కోటిరెడ్డి, లక్కీ నాయక్, అడవిదేవులపల్లి అధ్యక్షులు కే నాగేశ్వరరావు, కార్యదర్శి దేశీయ నాయక్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్