
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఏప్రిల్ 21.
పినపాక మండలం లోని మండల కార్యాలయం నందు వి ఓ ఏ ల నిరవధిక సమ్మెకు హాజరై సంఘీభావం తెలుపుతూ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం వారితోపాటు దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ సందర్బంగా రామనాధం మాట్లాడుతూ వి ఓ ఏ ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతామని,వి ఓ ఏ ల డిమాండ్స్ ను వేంటనే ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేలను అమలు చేయాలని ,ఆరోగ్య భీమా ఇతర సదుపాయాలను కల్పించాలని కోరారు.పినపాక మండలం తాహాశీల్ధార్ కార్యాలయం నందు వి ఓ ఏ లు గత ఐదు రోజులుగా సమ్మెకు దిగిన ప్రభుత్వ అధికారులు చలించకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వి ఓ ల కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం మైనారిటీ కన్వీనర్ బషీరుద్దీన్, పూనెం వెంకటేశ్వర్లు, యాలం బుజ్జిబాబు, బత్తుల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





