
డయల్ యువర్ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల ద్వారా మంచి స్పందన వస్తుందన్న డిపో మేనేజర్…
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 19:
కాలర్…పో రెడ్డి గూడెం నుండి రిటైర్డ్ టీచర్ అప్పారెడ్డి అడిగిన ప్రశ్న ?..
గతంలో మా ఊరి మీదుగా మాడుగులపల్లి, పోరెడ్డి గూడెం అనే పేరుతో బస్సు నడిపేవారు, ప్రస్తుతము ఏ బస్సు లేక మేము ప్రయాణం చేయుటకు ఇబ్బంది పడుతున్నాం. దయచేసి తిరిగి బస్సుని యధావిధిగా నడపగలరని కోరుతున్నాం ము.
మిర్యాలగూడ ఆర్టీసీ డిఎం బొల్లెద్దు పాల్ సమాధానం..
గతంలో మీరు చెప్పినట్లుగానే రెండు బస్సులను ఆపోజిట్ గా నడిపే వాళ్ళం కాని రాను రాను బస్సు ఎక్కే జనాలు తగ్గటం, బస్సుని ఆదరించకపోవడం వలన ,కనీసం డీజిల్ పైసలు రాలేకపోవడం మూలాన బస్సును ఆపివేయబడింది, అయినప్పటికీ తిరిగి మీ యొక్క కోరికను పున:పరిశీలిస్తాం.
కాలర్..మాడుగుల పల్లి గ్రామం నుండి శ్రీనివాసరెడ్డి గారు కోరిన , పోరెడ్డి గూడెం అప్పారెడ్డి అడిగిన కోరికే వీరు అడిగారు ?
డి ఎం సమాధానం…
పై కాలర్ కు తెలియజేసిన సమాధానమే వీరికి తెలియజేశారు.
కాలర్..
మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ నుండి రమణారెడ్డి అడిగిన ప్రశ్న?
బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కొరకు మీరు ఏర్పాటు చేసిన ఉచిత టాయిలెట్స్ ను, ఆడవాళ్లు వినియోగించుకున్న సందర్భంలో అక్కడ ఉన్నవారు జులుంతో, అమర్యాద మాటలతో, డబ్బులు వసూలు చేయుచున్నారు ,కాబట్టి దయచేసి ఇట్టి విషయంపై మీరు తగు చర్య తీసుకోగలరని కోరుచున్నాను .
ఆర్టీసీ డిఎం బి. పాల్ సమాధానం...
మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను ముఖ్యంగా ఉచిత టాయిలెట్స్ ని వినియోగించుకున్న వారు ఏ ఒక్కరూ ఒక్క పైసా కూడా ఇవ్వనవసరం లేదు. ఇట్టి విషయంపై విచారణ చేసి తగు చర్య తీసుకుంటానని తెలియజేయుచున్నాను.
కాలర్..చింతగూడెం నుండి మెడికల్ రిప్రజెంటేటివ్ వెంకటరెడ్డి అడిగిన ప్రశ్న?
చెక్పోస్ట్ మీదుగా యాచారం కనగల్లు బస్సును క్రమంగా నడపగలరని కోరుచున్నాను.
ఆర్టీసీ డి ఎం సమాధానం..
మీరు అడిగిన సమస్య ఆయా గ్రామాలమీదుగా నడిపే బస్సు నల్లగొండ డిపో పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని ఆ డిపో డిఎం దృష్టికి తీసుకెళ్తాను.
కాలర్… మిర్యాలగూడ పట్టణం నుండి రాజశేఖర్ ప్రశ్న?
నేను ఆర్టీసీ వాళ్లు నడుపుతున్న కార్గో ద్వారా పార్సెల్ పంపుతుంటే వాటిలో కొన్ని మిస్ అవుతున్నాయి ,నేను ప్రభుత్వ సంస్థ నమ్మకమైనదిగా భావించి పంపుచుంటే కొన్ని మిస్ అవ్వడం వల్ల… కార్గో పై నమ్మకాన్ని కోల్పోతున్నాను ,కాబట్టి దయచేసి ఇట్టి విషయంపై తగు చర్య తీసుకోగలరని, మరియు ఎంక్వయిరీ నందు ఎప్పుడు ఏ విషయం గూర్చి అడిగిన, తెలుసుకోవాలన్న ఎవ్వరు కనిపించరు ,ఈ రెండు విషయాలను పరిశీలించగలరని కోరుతున్నాను.
ఆర్టీసీ డి ఏం సమాధానం...
కార్గో ద్వారా మీకు ఎదురైన సమస్యను వివరంగా నా దృష్టికి తీసుకుని వచ్చినచో దానిపై తగు చర్య తీసుకుంటాను. అంతేకాకుండా పార్సల్ మిస్ అవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు, జరగకుండా చూసుకుంటాను. ఇక ఎంక్వయిరీ నందు తప్పనిసరిగా ఒక మనిషిని వారం రోజులు, 24 గంటలు ఉంచుతాము. మీరు వచ్చిన సమయాన అతను ఏ చిన్న పనిపై లోనికి వెళ్ళాడో…అది కూడా తెలుసుకొని పరిశీలిస్తా.
కాలర్.. లోకల్ నుండి శేష సాయి గారు అడిగిన ప్రశ్న ?
మెయిన్ గేటు బోర్డ్ ఏమైన మార్చే అవకాశం ఉన్నదా?
మరియు గతంలో ఏర్పాటు చేసిన మాదిరిగా బస్సుల యొక్క సమయపాలన బోర్డులను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?
ఆర్టీసీ డి ఎం సమాధానం...
ఒకవేళ పై అధికారుల సూచనల మేరకు మార్చే అవకాశం ఉంటే మార్చగలం, మరియు ఆర్టీసీ డిపో మీదుగా వెళ్లే ఇతర బస్సు డిపోల వారి సమయాల మార్పిడి సమాచార ఆలస్యం వలన బోర్డులు ఏర్పాటు చేయుటకు కొంత సమయం పడుతుంది.
కాలర్…లోకల్ నుండి వెంకన్న గారు అడిగిన ప్రశ్న ?
మన డిపో నుండి మంచిర్యాలకు బస్సు నడిపే అవకాశం ఏదైనా ఉంటే నడపగలరని కోరుతున్నాను .
ఆర్టీసీ డి ఎం సమాధానం..
మీ యొక్క కోరికను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పక పరిశీలిస్తాం.
కాలర్..దిలావర్ పూర్ నుండి క్రాంతి కుమార్ గారు అడిగిన ప్రశ్న?
మా ఊరికి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉదయం, సాయంత్రం బస్సు నడపగలరని కోరుచున్నాను .
ఆర్టీసీ డి ఎం సమాధానం…
గతంలో మీ ఊరికి ఒక బస్సు ని ప్రత్యేకంగా నడిపే వాళ్ళం. అలాంటిది, నేడు ఒక్క ట్రిప్పు కూడా నడపలేక పోవుటకు గల కారణం మీకు తెలిసిందే, మీరు బస్సు ఎక్కకపోవడం, కనీసం మాకు బస్సు అవసరం అనే విషయం కూడా మర్చిపోయారూ, అలాంటప్పుడు మేము బస్సును నడపలేక ఆపేసాము, మీ కోరిక మేరకు ఉదయం, సాయంత్రం విద్యార్థుల కొరకు నడిపే విధంగా పరిశీలిస్తాం.ఇట్టి కార్యక్రమంలో ఆర్టీసీ డి ఎం బి. పాల్ తో పాటు సి ఆర్ సి జనార్దన్ ఆర్టీసీ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.





