వివోఏ ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి: సిఐటియు జిల్లా నాయకులు ఉప్పతల నరసింహారావు.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 17.

న్యాయపరమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని, పరిష్కారం చూపించాలని పినపాక మండల వివోఏ ల సంఘం సోమవారం నుండి నిరవధిక సమ్మెను సిఐటియు జిల్లా నాయకులు ఉప్పతల నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 17వ తారీకు నుండి నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నామని చాలీచాలని జీతంతో చాలా సంవత్సరాల నుండి వివో ఏలు తమ జీవితాలను గడుపుతున్నారని, కుటుంబ పోషణకు చాలా కష్టంగా ఉందని తెలియజేశారు. ఐకెపి వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, 26 వేల కనీస వేతనం చెల్లించి, 10 లక్షల రూపాయల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఆన్లైన్ పనులను కూడా చేయించడంతో మానసికంగా అలసిపోతున్నారని అన్నారు. అర్హులైన వివోఏ లను సిసిలుగా పదవోన్నతి కల్పించాలని కోరారు. న్యాయం జరిగే వరకూ నిరవధిక సమ్మెను ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పండ్రమీషు నాగ ప్రమీల, కార్యదర్శి ఎక్కంటి వీరలక్ష్మి , కోశాధికారి ఇనపాల సునీత , ఉపాధ్యక్షురాలు కూరాకుల ఝాన్సీ రాణి, సహాయ కార్యదర్శి బందెల శ్రీనివాస్, ఉండం బాబురావు, ఇతర వివోఏలు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి