
జన సముద్రం న్యూస్,14ఏప్రిల్,గోరంట్ల.
గోరంట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషద్ బాలుర ఉన్నత పాఠశాలలో, దాతల విరాళాలతో దాదాపు రూ. 20 లక్షల వ్యయంతో పంచాయితీ ఆధ్వర్యంలో మండల ప్రజలకు ఉచితంగా సేవలు అందించడానికి ఒక వైకుంఠ రథాన్ని మరియు నాలుగు డెడ్ బాడీ ప్రీజర్లును మండల ప్రజలకు అంకితం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసన సభ సభ్యులు శ్రీ మాలాగుండ్ల శంకర్ నారాయణ గారు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు, MLC శ్రీమతి మంగమ్మ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ దహన సంస్కారాలు చేయలేని ఎంతోమంది పేద ప్రజలకు ఈ సౌకర్యం చాలా ఉపయోగపడుతుందని, బంధువులు లేని అనాధలా ఎవరు వెళ్ళకూడదు, డబ్బులు లేని పేదవారిలా ఎవరు వెళ్ళకూడదనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమని , ఈ గొప్ప కార్యక్రమానికి విరాళాలు అందించిన దాతలకు ప్రత్యేక కృతఙ్ఞతాభివందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాతలు, స్థానిక ZPTC, కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ, సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు,మండల స్థాయి అధికారులు, పంచాయితీ అధికారులు, సచివాలయ సిబ్బంది, దాతలు,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.






