
జన సముద్రం న్యూస్,14 ఏప్రిల్,అనంతపురం.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం లోని ప్రధాన సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ కె.భాస్కర్ రెడ్డి గారు, ఉప ముఖ్య కార్య నిర్వహణ అధికారి శ్రీ అమృత రాజ్ గారు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.





