
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 14:
ఈరోజు మిర్యాలగూడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా విచ్చేసిన బిజెపి మిర్యాలగూడ నియోజవర్గ అసెంబ్లీ పాలక్ కవిత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా కవితను మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయడానికి సంఘీభావం తెలపాలని కోరారు.
ఈ సందర్బంగా జిల్లా సాధన సమితి నాయకులు జ్వాలా వెంకటేశ్వర్లు, చేగొండి మురళీ యాదవ్,బంటు కవిత మాట్లాడుతూ..

జిల్లా ఏర్పాటు విషయంలో పాలకులు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అంబేడ్కర్ జయంతి రోజుతోనైన పాలకుల్లో మార్పు రావాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అనంతరం అక్కడ వచ్చిన బీజేపీ మిర్యాలగూడ నియోజకవర్గ అసెంబ్లీ పాలక్ కవితకు జిల్లా ఏర్పాటు… బీజేపీ తరపున ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలాని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు బంటు కవిత, జేపీ నాయడు, హన్య నాయక్, దశరథ్ నాయక్, భీమ్లా నాయక్, వెంకటయ్య తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.





