
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ .. ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి. బడుగు బలహీన వర్గాల జీవితాలల్లో వెలుగులు నింపిన ఆశాజ్యోతి, మనందరికి దశ దిశ నిర్దేశం దారి చూపిన దేవుడు, నవభారత స్వాప్నికుడు, ప్రపంచ మేధావి, న్యాయవాది, సంఘ సంస్కర్త అద్భుతమైన రచయిత తిరుగులేని ఉద్యమకారుడు భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న అంబేడ్కర్ 132. వ జయంతి సందర్బంగా… పట్టణంలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా ఫూలమాలలతో నివాళులు అర్పించటం జరిగింది, అంబేడ్కర్..దళితబందు పథకం లాగానే బీసీ బంధు పథకం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 56శాతం పైగా ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి…పది లక్షల రూపాయలు ప్రకటించి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జీవో వెంటనే విడుదల చేయాలని ఆలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియాంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్, వెంటనే విడుదల చేసి మెస్ ఛార్జిలను పెంచలన్నారు అదే విధంగా గురుకులాలను పెద్ద మొత్తంలో పెంచాలని,బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆయన జయంతి సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో సహకార సింగిల్ విండో మాజీ చైర్మన్ కోల వెంకన్న ముదిరాజ్, ఓబీసీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జానపాటి రవి బంటు జశ్వంత్ మేఘన సుధాకర్ అశోక్ రంగా నాగరాజ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.





