సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్: డాక్టర్ చందా సంతోష్ కుమార్

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, కరకగూడెం, ఏప్రిల్ 14.

ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని టిపిసిసి సభ్యులు డాక్టర్ చంద సంతోష్ కుమార్ అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో టిపిసిసి సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ చందా సంతోష్ కుమార్ మాట్లాడుతూ అత్యంత మేధోసంపత్తితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ,అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు.స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని,
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.అనంతరం పంచాయతీ కార్మికుల యొక్క సేవలను అభినందించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రెటరీ మిట్టపల్లి నితిన్ , మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకట రత్నమ్మ , మండల ప్రధాన కార్యదర్శి చందా నాగేశ్వరరావు , మండల నాయకులు చెన్నూరి రవీంద్ర , గోగు కిరణ్ కుమార్ , కొండ గొర్ల సమ్మయ్య , గాంధర్ల నరేష్ , చెన్నూరి నరసింహారావు ,చెన్నూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి