నేతకాని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఏప్రిల్ 14.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలం లో
అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఉప్పాక గ్రామంలో గల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేతకాని సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి ,భారత దేశ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని వక్తలు కొనియాడారు. యుగాలు మారినా తరాలు మారినా అంబేద్కర్ లాంటి మహానీయుడు మళ్లీ జన్మించబోడని, భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చదివి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కులమతాలకు అతీతంగా ప్రతి పౌరుడు సమ గౌరవంతో సమాన హక్కుల్ని పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించారని, భిన్న సంస్కృతులు, భిన్న మతాలకు అవకాశాలను కల్పించిన ఈ భారత దేశంలో ప్రజలందరి ఆదరణను, నమ్మకాన్ని చూరగొన్న రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహనీయుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం సుజాత, ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు, నేతకాని సంఘం నాయకులు జిమ్మిడి శివశంకర్, గుమాస్ గోవర్ధన్ ,జాడి రాంబాబు , సుమన్ నరసింహారావు కన్నయ్య శ్రీనివాస్ , బోడ లక్ష్మణ్ రావ్,గద్దల సమ్మయ్య, రామచంద్రం, సుమలత, రాణి, సంపత్, గ్రామస్తులు తదితర నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి